ఊరు కాదు వీధి

Viral photo of Polish town Suloszowa shows 6000 people - Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఒక ఊరు అనుకుంటే పొరపాటే. అదొక వీధి. అక్కడ ఏకంగా 6 వేల మంది నివసిస్తున్నారు. ఆ వీధి మొదలు ఎక్కడుందో, చివర ఎక్కడుంటుందో అక్కడ నివసించే వారికే సరిగ్గా తెలీదు. ఇలాంటి వీధి పోలండ్‌లో ఉంది.

ఈ వీధికి సంబంధించిన ఏరియల్‌ వ్యూ ఫొటో ఇటీవల వైరల్‌గా మారింది. దక్షిణ పోలండ్‌లో సులోస్జోవా అనే  పట్టణంలో ఈ వీధి ఉంది. దీని పొడవు ఏకంగా తొమ్మిది కిలో మీటర్లు. ప్రపంచంలోనే అతి పెద్ద వీధి ఇదే. ఇరువైపులా పచ్చని పంట పొలాలతో, పొందికగా అమర్చిన ఇళ్లతో ఈ వీధి ఫొటోలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top