ముందనుకున్న ప్లాన్‌ వేరు.. అనుకోకుండా ఆకాశంలో పెళ్లి!

Viral: Couple Marriage On Flight After Cancellations Ruin Their Wedding Plans - Sakshi

సాధారణంగా పెళ్లిళ్లు మన చేతుల్లో ఉండవు, అవి స్వర్గంలో నిర్ణయించబడాతాయని పెద్దలు అంటుంటారు. ఇదే తరహాలోనే.. వీళ్లకి మాత్రం తామ జీవిత భాగస్వామిని ఎంచుకున్నప్పటికీ వారి వివాహం మాత్రం వాళ్లు ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం జరగలేదు. ఎందుకంటే భూమి మీద అనుకున్న వారి వివాహం ఆకాశంలో జరుపుకోవాల్సి వచ్చింది. ఆ జంట పేర్లే.. జెరెమీ సాల్డా, పామ్ ప్యాటర్‌సన్. వివరాల్లోకి వెళితే.. జెరెమీ సాల్డా, పామ్ ప్యాటర్‌సన్ గత రెండు సంవత్సరాలు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తమ తమ ఇంట్లో పెద్దలని కూడా ఒప్పించారు. అంతా ఓకే  అనుకున్నాక పెళ్లి మండపానికి వెళ్లడానికి విమానం టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఆ విమానం ఆలస్యమైంది.

చివరకు వాతావరణం అనుకూలంగా లేని కారణంగా క్యాన్సిల్‌ అయ్యింది. దీంతో ఆ జంట చాలా నిరాశలోకి వెళ్లింది. ఆ సమయంలో ఏం చేయాలో వాళ్లకి అర్థం కావడం లేదు. అప్పుడే క్రిస్ అనే మరో వ్యక్తి వారికి పరిచయమయ్యాడు. అతను కూడా ఆ క్యాన్సిల్ అయిన విమానం ఎక్కాల్సి ఉంది. విమానం క్యాన్సిల్ వార్త విని బాధలో ఉన్నా ఆ జంట దగ్గరకు వెళ్లి అసలు విషయం తెలుసుకున్నాడు. అనంతరం వాళ్ల సమస్య కావాలంటే సాయం చేస్తానని చెప్పాడు.

అదృష్టం కలిసొచ్చి ముగ్గురికీ ఒకే విమానంలో సీట్లు దొరికాయి. అయితే ఆ విమానం సిటీకి మరో చివర ఉంది. దాంతో ఉబెర్ బుక్ చేసుకొని వేగంగా అక్కడకు చేరుకున్నారు. విమానం ఎక్కగానే అక్కడ కనిపించిన ఫ్లైట్ అటెండెంట్ జూలీ రేనాల్డ్స్‌కు తమ సమస్య చెప్పింది పామ్. తమ వద్ద పెళ్లి జరిపించడానికి చర్చిలో అనుమతి పొందిన క్రిస్ ఉన్నట్లు కూడా చెప్పారు. కొంచెం సహకరిస్తే విమానంలోనే పెళ్లి తంతు ముగిస్తామని వారి అడిగారు. ఇదే విషయాన్ని పైలట్‌కు చెప్పగానే అతను కూడా సరే అన్నాడు. అంతే విమానం గాల్లోకి లేచిన తర్వాత 37 వేల అడుగుల ఎత్తులో పామ్, జెరెమీ సాల్డా ఇద్దరూ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి.

చదవండి: తిడతావా? తిట్టు.. నేనేం పుతిన్‌లా కాదు: బైడెన్‌ వెటకారం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top