అమెరికాలో మళ్లీ కాల్పులు | USA: Three people killed in Pittsburgh shooting | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ కాల్పులు

Oct 17 2022 6:27 AM | Updated on Oct 17 2022 6:27 AM

USA: Three people killed in Pittsburgh shooting - Sakshi

పిట్స్‌బర్గ్‌: అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో కాల్పులు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మరణించారు. మరో వ్యక్తి గాయపడ్డాడు.

శనివారం రాత్రి 10 గంటలకు నార్త్‌సైడ్‌ ఇంటర్‌సెక్షన్‌ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. కాల్పులకు బాధ్యులు ఎవరన్నది ఇంకా నిర్ధారించలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. అలాగే బాధితుల వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. కాల్పులు జరిపింది ఒక్కరేనా లేక ఎక్కువ మంది ఉన్నారా? అనే దానిపై దర్యాప్తు సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement