breaking news
Two women killed
-
అమెరికాలో మళ్లీ కాల్పులు
పిట్స్బర్గ్: అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో కాల్పులు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మరణించారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. శనివారం రాత్రి 10 గంటలకు నార్త్‌సైడ్ ఇంటర్సెక్షన్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. కాల్పులకు బాధ్యులు ఎవరన్నది ఇంకా నిర్ధారించలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. అలాగే బాధితుల వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. కాల్పులు జరిపింది ఒక్కరేనా లేక ఎక్కువ మంది ఉన్నారా? అనే దానిపై దర్యాప్తు సాగుతోంది. -
టర్కీలో టెర్రర్ హర్రర్!
ఇస్తాంబుల్: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉగ్రవాదులు మరోసారి అలజడి సృష్టించారు. ఇద్దరు మహిళా మిలిటెంట్లు టర్కీ పోలీసుల బస్సుపై తుపాకీ కాల్పులు, గ్రనేడ్ దాడులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడగా.. సత్వరమే స్పందించిన పోలీసులు ఆ ఇద్దరు మహిళా సాయుధులను సంఘటనా స్థలంలోనే కాల్చిచంపేశారు. ఇస్తాంబుల్‌లోని బేరాంపాస జిల్లాలోని పోలీసు స్టేషన్ లక్ష్యంగా మహిళా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పోలీసు స్టేషన్లోకి పోలీసుల బస్సు వెళుతుండగా ఒక మహిళ కాల్పులు జరుపగా, మరొక మహిళ గ్రనేడ్లు విసిరింది. సంఘటనా స్థలం నుంచి పరారైన మహిళా సాయుధులను ప్రత్యేక బలగాలు చుట్టుముట్టాయి. ఓ బంగ్లాలో దాచుకున్న మహిళా ఉగ్రవాదులు, ప్రత్యేక బలగాల మధ్య దాదాపు గంటపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ దాడుల నేపథ్యంలో టర్కీలోని కుర్దీష్ ప్రాబల్యమున్న వాయవ్య ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ మిలిటెంట్లకు, ప్రభుత్వానికి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవ్వడంతో ఆ మిలిటెంట్లే ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
తాడేపల్లిగూడెం : ఆయిల్ ట్యాంకర్ ఆ అత్తాకోడళ్ల పాలిట మృత్యుశకటమైంది. జాతీయ రహదారి డివైడర్‌పై కూర్చున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన గురువారం ఉదయం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి జాతీయరహదారిపై కమ్మ కల్యాణ మండపం వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తణుకు రూరల్ మండలం తే తలి గ్రామానికి చెందిన భూపతిరాజు సత్యనారాయణరాజు, అతడి కుమారుడు శివరామరాజు దంపతులు రెండు మోటార్ సైకిళ్లపై తేతలి నుంచి ద్వారకాతిరుమలకు కల్యాణం చేయించుకునేందుకు బయలుదేరారు. వారు తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి జాతీయ రహదారి కమ్మ కల్యాణ మండపం దగ్గరకు వచ్చేసరికి ఒక మోటార్ సైకిల్ వెనుక చక్రం పేలిపోయింది. దీంతో సత్యనారాయణరాజు భార్య ధనలక్ష్మి (45) , శివరామరాజు భార్య గీతా పావని (25)ని దింపి పంక్చర్ వేరుుంచుకొచ్చే వరకు డివైడర్‌పై ఉండాలని కూర్చోపెట్టారు. సుమారు పది అడుగుల వెడల్పు కలిగిన డివైడర్‌పై వారు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సత్యనారాయణరాజు తనతో పాటు ఉన్న కూతురు కొడుకు (మనుమడు) వర్మను తీసుకుని మెకానిక్ కోసం గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్డుకు అటువైపునకు వెళ్లగా శివరామరాజు లఘుశంక తీర్చుకునేందుకు పక్కకు వెళ్లారు. ఈలోగా తణుకు నుంచి విజయవాడ వైపునకు అతివేగంగా వెళుతున్న ట్యాంకర్ అదుపు తప్పి డివైడర్‌పైకి ఎక్కి అక్కడే కూర్చొన్న ధనలక్ష్మి, పావనిలపై నుంచి దూసుకెళ్లింది. లారీ వారిని సుమారు 150 మీటర్ల దూరం వరకు ఈడ్చుకొని పోయింది. తీవ్రగాయాలపాలైన వారిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ లారీని వదిలి పరారయ్యారు. శివరామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని తాడేపల్లిగూడెం రూరల్ ఎస్సై వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. మృతదేహాలకు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు . పెళ్లిరోజునే ఘటన శివరామరాజు, పావని దంపతుల పెళ్లిరోజు గురువారం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ద్వారకాతిరుమల చినవెంకన్నను దర్శించుకుని కల్యాణం జరిపించుకునేందుకు ఉదయం ఇంటి వద్ద నుంచి మోటార్ బైక్‌లపై సంతోషంగా బయలు దేరారు. అప్పటివరకు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ప్రయూణిస్తుండగా మోటార్ సైకిల్ టైర్ పంక్చర్ కావడంతో ఆగాల్సి వచ్చింది. కళ్లెదుటే తమ భార్యలు అనంతలోకాలకు చేరడంతో ఘటనాస్థలంలో తండ్రీకొడుకుల రోదనలు చూపరులను కలచివేశాయి. తేతలిలో విషాదఛాయలు తేతలి (తణుకు) : పెదతాడేపల్లి అయిదో నంబర్ జాతీయరహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అత్తాకోడళ్లు మృతి చెందిన ఘటనతో తేతలిలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన అత్తాకోడళ్లు భూపతిరాజు ధనలక్ష్మి ,భూపతిరాజు గీతాపావని దుర్మరణం పాలవడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. శివరామరాజు తణుకులో ఫొటోస్టూడియో నిర్వహించుకుంటూ తల్లిదండ్రులతోనే కలిసి జీవిస్తున్నాడు. అతడికి మూడేళ్ల కిత్రం గీతాపావనితో వివాహమైంది. వారికి పిల్లలు లేరు. ధనలక్ష్మికి గీతా పావని స్వయానా అన్నయ్య కూతురు కావడంతో ఆమెను కూతురు కంటే ఎక్కువగా అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. వీరి మృతిపై గ్రామ ప్రముఖులు సంతాపం తెలిపారు.