Interview Tip: జాబ్‌ కోసం ఇలా కూడా చేస్తారా.. ఇదో వెరీ స్పెషల్‌ కేక్‌ బాసూ..

US Woman Prints Resume On Cake After Sends To Nike - Sakshi

ఒక పనిని ఒకే విధంగా చేయాలి అనే రూలేమీ లేదు. ఎవరికి నచ్చిన విధంగా వారు తమ వినూత్న ఆలోచనతో పనిచేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చాలా స్మార్ట్‌గా ఆలోచించింది. అందులో భాగంగానే కేక్‌పై తన రెజ్యూమ్‌ను ప్రింట్‌ చేసి.. కంపెనీకి పంపించింది. ఆమె చేసిన పని ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. 

వివరాల ప్రకారం.. నార్త్‌ కరోలీనాకు చెందిన కార్లీ పావ్‌లినాక్ బ్లాక్‌బర్న్ అనే మహిళ సాంప్రదాయ పద్ధతికి విరుద్ధంగా కేక్‌పై తన రెజ్యూమ్‌ను ప్రింట్ చేసింది. అనంతరం, ఆ కేక్‌ను ప్రముఖ సంస్థ ‘నైకీ’కి పంపించింది. ఈ సందర్భంగా ఆమె.. ఎందుకు ఇలా చేశానో సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. కొన్ని వారాల క్రితం తాను కేక్‌పై రాసిన రెజ్యూమ్‌ని నైకీ కంపెనీకి పంపినట్లు పేర్కొంది. నైకీ కంపెనీ టీం ప్రస్తుతం ఎలాంటి పోస్ట్‌లకు రిక్రూట్‌ చేసుకోవడం లేదని తెలిపింది.

అయితే, తన గురించి నైకీ కంపెనీలో ఉద్యోగం సాధించడమే తన టార్గెట్‌ అని పేర్కొంది. ఈ విషయం నైకీ టీంకి తెలియజేయడం కోసం ఏదైనా కొత్తగా చేయాలని ఇలా చేసినట్టు చెప్పింది. అందుకే కేక్‌పై రెజ్యూమ్‌ ప్రింట్‌ చేసి పంపినట్లు వివరించింది. నైకీ కంపెనీ హెడ్‌ ఆఫీసులో జరుగుతున్న పెద్ద పార్టీకి కేక్ పంపడం కంటే మెరుగైన మార్గం ఏముంటుందని తనను తాను సమర్ధించుకుంది. కాగా, ఆమె చేసిన కేక్‌ రెజ్యూమ్‌ ఆలోచన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కొంతమంది ఆమె ఆలోచనను మెచ్చుకున్నారు. కంపెనీ యాజమాన్యం దృష్టిని ఆకర్షించేందుకు అద్భుతమైన కాన్సెప్ట్ అని అన్నారు. మరికొంత మంది మాత్రం ఆమె జిమ్మిక్స్‌ చేస్తుందంటూ కామెంట్స్‌ చేశారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top