ముక్కలుగా ముక్కలుగా కాళ్లు, చేతులు.. అయినా నవ్వుతూ..

Man Lying On Hospital Bed With Smile But Its Actually Cacke - Sakshi

లండన్‌: ప్రస్తుత కాలంలో మార్కెట్లో మనకు భిన్న రకాలైన కేకులు అందుబాటులోకి వస్తున్నాయి. మనకు ఎలా కావాంటే ఆ రూపంలో కేకులను తయారు చేయించుకునే అవకాశం కూడా ఉంది. ఆడ వస్తువులు, మనం ధరించే దుస్తులు, చెప్పుల నుంచి ఆఖరికి వంటింట్లో వాడే కూరగాయల వరకూ ఇలా విభిన్నమైన కేకులు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో మరి వింతగా పెంపుడు జంతువుల రూపంలో కూడా కేకుల వీడియోలు, సామాజిక మాధ్యమాల్లో తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ హాస్పిటల్‌ బెడ్‌పై నవ్వుతున్న ఓ వ్యక్తి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తి బెడ్‌పై ఒరిగి ఉండగా.. అతడి బెడ్‌ పక్క టెబుల్‌పై మందులు, క్యాండిల్‌తో పాటు పక్కనే ఓ మహిళ చేతితో కేకు పట్టుకుని అతడికి తినిపించేందుకు రేడీగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఆశ్చర్యంగా ఆ వ్యక్తి కాళ్లు, చేతులు, ముక్కులు ముక్కలుగా కట్‌ చేసి ఉన్నప్పటికి ఆ వ్యక్తి నవ్వుతూనే కనిపిస్తున్నాడు.

దీంతో అదేంటి ఈ వ్యక్తి అలా ఎలా నవ్వుతున్నాడంటు పరీక్షించి చూడగా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే ఆ వ్యక్తి నిజమైన వ్యక్తి కాదు. బ్రిటిష్‌కు చెందిన ఓ కేకుల తయారి నిపుణుడు బెన్‌ కూల్లేన్‌ వినూత్న  ఆలోచన ఇది. ‘ది బేక్‌ కింగ్‌’ గా పిలిచే బెన్‌ వివిధ రూపంలో కేకు తయారు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు. ఈ క్రమంలో అతడు మరింత భిన్నంగా ఆలోచించి ఏకంగా మనిషి రూపంలో హైపర్ రియలిస్టిక్ కేక్ తయారు చేశాడు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిజంగా మనిషిలా కనిపిస్తున్న ఈ కేకు మనిషిని చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోతూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బెడ్‌ పడుకున్న వ్యక్తి రూపంలో కేకు తయారు చేసిన అతడి సృష్టికి అవాక్కవుతూ కొంతమంది ప్రశంసిస్తూంటే.. ఇలా హాస్పిటల్‌ బెడ్‌పై పెషెంట్‌ వ్యక్తి రూపంలో కేకు తయారు చేయడమెంటో విడ్డూరం అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

(చదవండి: జాత్యహాంకార వ్యాఖ్యలు: రాజీనామా..)
               (గాల్లో ఎగిరే దోశలు.. వీడియో వైరల్
)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top