ఈ గాలి.. ఈ నేల... బాల్య స్మృతుల్లో కమలా హ్యారిస్‌

US Vice President Kamala Harris Visits Indian Grandfather Home In Zambia - Sakshi

లుసాకా: అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్‌ జాంబియా వెళ్లి తన బాల్య స్మృతుల్లో మునిగిపోయారు. తన తాత, భారత్‌కు చెందిన పి.వి.గోపాలన్‌ ఇంట్లో చిన్నప్పుడు వారితో గడిపిన రోజుల్ని గుర్తు చేస్తుకున్నారు. 1960 దశకంలో కమల హ్యారిస్‌ తాత చెన్నై నుంచి జాంబియా రాజధాని లుసాకా వెళ్లి అక్కడ ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసు అధికారిగా సేవలందించారు.

అప్పట్లో తాము నివసించిన ఇల్లు  ఇప్పుడు లేకపోయినా ఆ ప్రాంతానికి వెళ్లిన కమల అక్కడ మట్టి పరిమళాన్ని ఆస్వాదించారు. ‘‘నా చిన్నతనంలో మా తాతయ్యతో గడిపిన రోజులు నాకెంతో విలువైనవి. ఈ ప్రాంతంలో నా బాల్యం గడిచింది. ఇప్పుడు మళ్లీ అక్కడే ఉన్నానన్న ఊహ  ఎంతో మధురంగా ఉంది.బాల్య జ్ఞాపకాలు ఎప్పుడూ ఒక ఉద్వేగాన్ని ఇస్తాయి. ఇక్కడ్నుంచి మా కుటుంబం తరఫున ప్రతీ ఒక్కరికీ హాయ్‌ చెబుతున్నాను’’ అని అంటూ కమలా హ్యారిస్‌ ఉద్విగ్నతకు లోనయ్యారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top