‘నెత‌న్యాహు.. మా క్యాంప‌స్‌పై బాంబులేయండి’ | US Student Arrested For Jokingly Asking Benjamin Netanyahu to Drop Bombs | Sakshi
Sakshi News home page

‘నెత‌న్యాహు.. మా క్యాంప‌స్‌పై బాంబులేయండి’

Apr 21 2026 1:54 AM | Updated on Apr 21 2026 8:37 AM

US Student Arrested For Jokingly Asking Benjamin Netanyahu to Drop Bombs

త‌మ క్యాంప‌స్‌పై బాంబులు వేయాలంటూ అమెరికాకు చెందిన విద్యార్థిని ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహుకు వాట్సాప్ ద్వారా సందేశం పంప‌డం సంచ‌ల‌నం క‌లిగించింది. అయితే ఆ మెసేజ్‌ను తాను జోక్‌గా పంపిన‌ట్లు తెలిపిన‌ప్ప‌టికీ పోలీసులు దానిని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించి అరెస్టు చేశారు.

విష‌యంలోకి వెళితే.. ఫ్లోరిడా ఇంట‌ర్నేష‌న‌ల్ యూనివ‌ర్సీటీ (ఎఫ్ఐయూ)కి చెందిన 23 ఏళ్ల గాబ్రియేలా స‌ల్దానా  యూనివ‌ర్సిటీకి చెందిన వాట్సాప్ గ్రూపులో నెత‌న్యాహ‌కు సందేశాన్ని పంపింది. ‘నెతన్యాహు, మా మాటలు మీకు వినిపిస్తే.. ఓషన్ బ్యాంక్ కాన్వకేషన్ సెంటర్‌లోని మా కాప్‌స్టోన్ విద్యార్థులపై కొన్ని బొన్‌బొన్స్ (బాంబులు) వేయండి’ అంటూ సందేశాన్ని పంపింది. 

అయితే గాబ్రియేలా పంపిన సందేశాన్ని పోలీసులు బాంబు బెదిరింపుగా భావించారు. దీంతో  పోలీసులు బెదిరింపు చర్యల చట్టం కింద గాబ్రియేలాపై కేసు నమోదు చేశారు. అయితే జోక్‌గా నెతన్యాహుకు సందేశాన్ని పంపినట్లు గాబ్రియేలా పేర్కొన్నప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. గాబ్రియేలాను అరెస్ట్ చేసి మియామిలోని టర్నర్ గిల్‌ఫోర్డ్ నైట్ కరెక్షనల్ సెంటర్‌కు తరలించారు. 

ఆమెను జడ్జి మిండీ ఎస్ గ్లేజర్ ముందు ప్రవేశపెట్టగా, బెయిల్ కోసం ఉన్నపళంగా 5వేల డాలర్లు చెల్లించాలని జడ్జీ తీర్పునిచ్చారు. అయితే ఫ్లోరిడా శాసనాల ప్రకారం ఒక వ్యక్తి చంపేయడం లేదా హాని కలిగిస్తామని లిఖితపూర్వకంగా బెదిరించినట్లు అభియోగాలు ఎదుర్కొన్న గాబ్రియేలా సల్దానాకు గరిష్టంగా 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement