China Warns US: అందుకు వెలకట్టలేని మూల్యం చెల్సించాల్సి వస్తుంది జాగ్రత్త!

US Is At Risk Of Paying Unbearable Price Due To Its Actions Over Taiwan - Sakshi

బీజింగ్‌: చైనా - అమెరికాల తత్సంబంధాలు దెబ్బతినడంలో తైవాన్ కీలకం కానుంది. గత కొంతకాలంగా తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా జోక్యాన్ని సహించలేని చైనా.. తైవాన్‌కు మద్ధతు తెల్పడం ద్వారా అమెరికా వెలకట్టలేని మూల్యం చెల్లించాల్సి వస్తుందని చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి వాంగ్ యి గురువారం మీడియా వేదికగా హెచ్చరించారు. తైవాన్‌ను తమ స్వంత భూభాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నట్లు చైనా ఈ సందర్భంగా పేర్కొంది. అంతేకాకుండా గత రెండేళ్లలో తన సార్వభౌమాధికారాన్ని నొక్కిచెప్పేందుకు తైవాన్‌ రాజధాని తైపీలో సైనిక, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది కూడా. తైవాన్ స్వతంత్ర దళాలను ప్రోత్సహించడం ద్వారా దానిని అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టడమే కాకుండా, అందుకు యూఎస్‌ వెలకట్టలేని మూల్యం చెల్లించాల్సి వస్తుందని వాంగ్ తాజాగా హెచ్చరించాడు.

కాగా ఎటువంటి అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ అటు చైనా, ఇటు అమెరికా దేశాల మధ్య తైవాన్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఐతే తైవాన్ ద్వీపం తమది స్వతంత్ర దేశమని, దాని స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలను పరిరక్షించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. మరోవైపు చైనా మాత్రం తమ భూభాగంలో కలవడం తప్ప తైవాన్‌కు వేరే మార్గం లేదని వాంగ్ తాజాగా ధీమా వ్యక్తం చేశాడు. ఐతే తైవాన్‌కు అంతర్జాతీయ మద్ధతుదారు, ఆయుధాల సరఫరాదారైన అమెరికా, తైవన్‌పై చైనా దాడి చేస్తే, తైవాన్‌ను రక్షించేందకు సైనికంగా జోక్యం చేసుకుంటుందా లేదా అనే విషయంపై చాలా కాలంగా అమెరికా వ్యూహాత్మక ధోరణిని అనుసరిస్తోంది.

చదవండి: రానున్న 2, 3 రోజుల్లో చలిగాలులతో కూడిన వానలు: వాతావరణ శాఖ

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top