breaking news
Dangerous situation
-
మీరు వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: అమెరికాకు చైనా వార్నింగ్
బీజింగ్: చైనా - అమెరికాల తత్సంబంధాలు దెబ్బతినడంలో తైవాన్ కీలకం కానుంది. గత కొంతకాలంగా తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా జోక్యాన్ని సహించలేని చైనా.. తైవాన్‌కు మద్ధతు తెల్పడం ద్వారా అమెరికా వెలకట్టలేని మూల్యం చెల్లించాల్సి వస్తుందని చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి వాంగ్ యి గురువారం మీడియా వేదికగా హెచ్చరించారు. తైవాన్ను తమ స్వంత భూభాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నట్లు చైనా ఈ సందర్భంగా పేర్కొంది. అంతేకాకుండా గత రెండేళ్లలో తన సార్వభౌమాధికారాన్ని నొక్కిచెప్పేందుకు తైవాన్ రాజధాని తైపీలో సైనిక, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది కూడా. తైవాన్ స్వతంత్ర దళాలను ప్రోత్సహించడం ద్వారా దానిని అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టడమే కాకుండా, అందుకు యూఎస్ వెలకట్టలేని మూల్యం చెల్లించాల్సి వస్తుందని వాంగ్ తాజాగా హెచ్చరించాడు. కాగా ఎటువంటి అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ అటు చైనా, ఇటు అమెరికా దేశాల మధ్య తైవాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఐతే తైవాన్ ద్వీపం తమది స్వతంత్ర దేశమని, దాని స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలను పరిరక్షించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. మరోవైపు చైనా మాత్రం తమ భూభాగంలో కలవడం తప్ప తైవాన్‌కు వేరే మార్గం లేదని వాంగ్ తాజాగా ధీమా వ్యక్తం చేశాడు. ఐతే తైవాన్‌కు అంతర్జాతీయ మద్ధతుదారు, ఆయుధాల సరఫరాదారైన అమెరికా, తైవన్పై చైనా దాడి చేస్తే, తైవాన్ను రక్షించేందకు సైనికంగా జోక్యం చేసుకుంటుందా లేదా అనే విషయంపై చాలా కాలంగా అమెరికా వ్యూహాత్మక ధోరణిని అనుసరిస్తోంది. చదవండి: రానున్న 2, 3 రోజుల్లో చలిగాలులతో కూడిన వానలు: వాతావరణ శాఖ -
ఏపీ ఆర్ధిక పరిస్ధితి ప్రమాదకరంగా ఉంది
-
మృత్యు‘హోల్స్’
ప్రమాదకరంగా మ్యాన్‌హోల్స్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలి మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలో తెరిచి ఉంచిన నల్లా గుంతలు ఎక్కడికక్కడ మృత్యు కుహారాలుగా మారుతున్నాయి. ఆయా వీధుల్లోని ఇరుకు సందుల్లో సైతం పెద్ద పెద్ద నల్లా గుంతలను తెరిచి ఉంచడంతో స్థానికులు ప్రమాదాల బారీన పడుతున్నారు. ఎవరైన తెలియని వ్యక్తులు రాత్రి వేళ ఇక్కడకు వచ్చారంటే ఆ గుంతల్లో పడాల్సిందే. ప్రదాన దహదారులు, చిన్న చిన్న గళ్లిలో కూడా మ్యాన్ హోల్స్ .. మృత్యు హోల్స్‌గా మారుతున్నాయి. నల్లాల గుంతలు ఎక్కడ పడితే అక్కడ తెరిచి ఉంచడంతో ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు. అంతేకాకుండా గతంలో పెద్ద బజార్‌లోని ఓ వీధిలో రాత్రి వేళలో లోతైన నల్లాగుంత పైకప్పు లేకపోవడంతో అది గమనించని ఓ వ్యక్తి అ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రజలు వీటి బారిన పడుతున్నా సంబంధింత అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదని ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడవిడి సృష్టించే అధికారులకు మిగతా సమయాలలో ప్రజల భద్రతను గాలికొదిలేస్తున్నారన్నారు. అప్పట్లో అధికారులు అఘా మేఘాలమీద స్పందించి తప్పనిసరిగా నల్లా గుంతలకు పైకప్పులు వేసుకోవాలని సూచించారు.కాని నేటి వరకు పట్టణంలోని అన్ని వీధుల్లో పైకప్పులు లేని నల్లా గుంతలే దర్శనమిస్తున్నాయి. ఇదే విధంగా అధికారులు నిర్లక్ష్య దోరణితో సమస్యను చిన్నదిగా పరిగణిస్తే పెద్ద ప్రమాదాలే జరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు. నిత్యం నల్లా బిల్లుల బకాయిలకు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు నల్లా గుంతల దుస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంత్తైనా ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. -
బద్రీనాథ్‌లో భయం భయంగా..
సాక్షి, న్యూఢిల్లీ, విజయవాడ బ్యూరో: గతేడాది ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్రికులపై విరుచుకుపడ్డ భారీ వరదలు మరోసారి వణికిస్తున్నాయి. చార్ధామ్ యాత్రకు వెళ్లిన పలువురు తెలుగు భక్తులు అక్కడ చిక్కుకుపోయారు. జోరు వానలోనే నానా కష్టాలు పడి బద్రీనాథ్ చేరుకుని ప్రస్తుతం అక్కడి చినజీయర్‌స్వామి ఆశ్రమంలో తలదాచుకుంటున్నా రు. మూడు రోజులుగా ఆశ్రమ నిర్వాహకులు వారికి భోజన వసతి కల్పించి ఆదుకుంటున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలకు చెందిన వారితోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, హైదరాబాద్ ప్రాంతాల వారు సుమారు 50 మంది యాత్రికులున్నారు. కరెంటు సదుపాయం, ఫోన్లు, ఏటీఎంలు పనిచేయక అవస్థలు పడుతున్నట్లు యాత్రికులు ఫోన్ ద్వారా ‘సాక్షి’ ప్రతినిధులకు తెలిపారు. మరో 100 మందికి పైగా తెలుగువారు బద్రీనాథ్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని చెప్పారు. వారిలో వృద్ధులు, మహిళలు ఉండటంతో ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారో తెలియక ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం జీయర్ ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడింది. పోలీసులను పంపి తెలుగు యాత్రికుల వివరాలను సేకరిం చింది. ఇక్కడున్న యాత్రికుల్లో ఇద్దరి మొబైల్స్ 9701456187, 9560935988 మాత్రమే పని చేస్తున్నాయి. యాత్రికులు విజయవాడ ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి బద్రీనాథ్‌లోని చినజీయర్ ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. ఆశ్రమం మేనేజర్ కృష్ణారావు వీరికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణం మెరుగుపడ్డాకే యాత్ర పునరుద్ధరణ ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కొనసాగటంతోపాటు నదులు ఉప్పొంగటం, వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రను తొలుత నిలిపివేయగా యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గంగోత్రి, యమునోత్రి యాత్రను కూడా సాయంత్రం నిలిపివేశారు. దీంతో చార్ధామ్ యాత్ర పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఉత్తరాఖండ్‌కు రెండు ఎంఐ-17 హెలి కాప్టర్లు సమకూర్చేందుకు కేంద్రం అంగీకరించింది. జూలై 25వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. గత ఏడాది వరద బీభత్సం అనుభవాల నేపథ్యంలో జాతీయ విపత్తు నివారణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్) అప్రమత్తమైంది. ఆరు సహా యక బృందాలను రంగంలోకి దించారు. అల్మోరా, పౌరి, రుద్రప్రయాగ, చమోలీ, హరిద్వార్‌లో యాత్రికుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంత ప్రమాదమని తెలిస్తే వచ్చే వాళ్లం కాదు భారీ వర్షాల వల్ల కరెంటు సరఫరా నిలిచిపోయి పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. కొండప్రాంతాల్లోని రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. మూడు రోజులుగా యాత్రికులు నానా అవస్థలు పడుతున్నా ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు ప్రారంభించలేదు. - బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం మూడు రోజుల క్రితం బద్రీనాథ్‌కి వచ్చాం. అప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. అంతా చినజీయర్‌స్వామి ఆశ్రమంలో ఉన్నాం. - సాక్షితో హరిబాబు(కేపీహెచ్‌బీ, హైదరాబాద్) చినజీయర్‌స్వామి ఆశ్రమంలో తలదాచుకున్నాం చినజీయర్‌స్వామి ఆశ్రమంలో తలదాచుకోవటంతో బయటపడగలిగాం. ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న తొమ్మిది మంది బంధువులతో కలిసి యాత్రకు వచ్చాం. - ఎస్వీఎస్ రావు (ఢిల్లీలో ఉంటున్న తెలుగు వ్యక్తి) చినజీయర్ ఆశ్రమంలో తలదాచుకుంటున్న కొందరు తెలుగువారు.. తుంగల భాస్కరరావు, సావిత్రి, అరుణ, నగరాజకుమారి, రాధ, సాంబశివరావు, సుబ్బారావు, ఎస్వీఎస్ రావు (కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు) ఎస్. హరిబాబు (చిత్తూరు) సోమయాజులు, రజని దంపతులు. యల్లప్ప, తాయారమ్మ దంపతులు, సూర్యనారాయణ, సుహాసిని, మౌనిక, మాల్యాద్రి (వీరిది కేపీహెచ్‌బీ కాలనీ) విశాఖపట్నం, రాజమండ్రి, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన దాదాపు 20 మంది ఉత్తరాఖండ్‌లో నదుల పరవళ్లు గత 24 గంటల్లో నైనిటాల్లో గరిష్టంగా 152 మి.మీ. వర్షం కురిసింది. అలకనంద, మందాకినీ పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. రుద్రప్రయాగ, చమోలీ, ఉత్తరకాశీ జిల్లాలలో అన్ని పాఠశాలలను సోమవారం వరకు మూసివేశారు. ప్రమాదస్థాయిలో అలకనంద, గంగ, మందాకినీ నదులు యాత్రికులు క్షేమం: కంభంపాటి బద్రీనాథ్‌లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యాత్రికులు బద్రీనాథ్‌లోని చినజీయర్‌స్వామి ఆశ్రమంలో క్షేమంగా ఉన్నారు. ఆశ్రమ నిర్వాహకులతోపాటు జాతీయ విపత్తుల సంస్థ సభ్యులతో మాట్లాడి వారికి సాయం అందించాలని కోరాం. ఏపీ భవన్ అధికారులూ యాత్రికులతో మాట్లాడుతున్నారు. - కంభంపాటి రామ్మోహన్రావు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి