ఐరాసలో వీగిపోయిన తీర్మానం

UNSC fails to adopt resolution on Israel-Palestine conflict after veto by US - Sakshi

ఐరాస: గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బుధవారం బ్రెజిల్‌ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానం వీగిపోయింది. ఇజ్రాయెల్‌ మిత్రదేశం అమెరికా ఈ తీర్మానాన్ని వీటో చేసింది.

ఇజ్రాయెల్‌ ఆత్మరక్షణ హక్కు గురించి ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడం తమను అసంతృప్తికి గురి చేసిందని అమెరికా వెల్లడించింది. ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా 12 దేశాలు ఓటు వేశాయి. రష్యా, బ్రిటన్‌ గైర్హాజరయ్యాయి. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా వీటో చేయడంతో తీర్మానం ఆమోదం పొందలేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top