మన టీ, సమోసాకు ఆ దేశంలో యమా క్రేజ్‌..! విజయసాయి రెడ్డి ట్వీట్‌

UK Youngsters Prefer Samosa Over Biscuits With Tea - Sakshi

లండన్‌: సాయంత్రమయ్యేసరికి వేడి వేడి సమోసా తిని,  పొగలు గక్కే టీ ఒక కప్పు లాగిస్తే ఎలాగుంటుంది. ఆ కాంబినేషన్‌ ఇచ్చే కిక్కు వేరుగా ఉంటుంది కదా. మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఈ చాయ్, సమోసా కాంబినేషన్‌కి ఇప్పడు బ్రిటన్‌ యువతరంలో యమా క్రేజ్‌ పెరుగుతోంది. సాధారణంగా తెల్లవారు టీతో పాటు బిస్కెట్లు తింటారు.

ఇప్పుడు వారి జిహ్వలు కొత్త రుచులు కోరుకుంటున్నాయని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ టీ అండ్‌ ఇన్‌ఫ్యూజన్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. వెయ్యి మందితో ఈ సర్వేని నిర్వహిస్తే సాయంత్రం స్నాక్‌గా గ్రానోలా బార్స్‌ (ఓట్స్‌తో చేసేది) చాలా బాగుంటుందని మొదటి స్థానం ఇచ్చారు. ఇక రెండోస్థానాన్ని మన సమోసా కొట్టేసింది. సర్వేలో పాల్గొన్న యువతరంలో 8 శాతం మంది సమోసాకి మొగ్గు చూపించారు.

విజయసాయి రెడ్డి ట్వీట్‌
యూకే పేవరేట్ మెనూలో మన చాయ్, సమోసా చేరడంపై ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బ్రిటన్ యువత తమ స్నాక్స్ లో స్వీట్లకు బదులు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. 16-24 ఏళ్ల మధ్య వయస్కుల్లో సగానికిపైగా.. టీతో కలిపి స్వీట్ బిస్కెట్ రుచిని ఆస్వాదిస్తున్నారని ట‍్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top