క్యాన్సర్‌పై సంచలన వివరాలు వెల్లడించిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు

UK NHS Says Cancer treatment costs may reduce significantly - Sakshi

లండన్‌: కేన్సర్‌ అంటే అందరికీ భయం కలిగించే వ్యాధితో పాటు అత్యధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. దీంతో క్యాన్సర్‌ అంటే ప్రతి ఒక్కరికి వెన్నులోంచి భయం పుట్టుకొస్తుంది. కానీ బ్రిటన్‌కి చెందిన నేషనల్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) నిర్వహించిన పరిశోధనల్లో సామాన్యుడు సైతం వైద్యం చేయించుకోగలిగే రీతిలో సరికొత్త చికిత్స విధానాన్ని తీసుకు వచ్చింది. ఎన్‌హెచ్‌ఎస్‌ ప్రపంచంలోనే  'గ్యాలరీ రక్త పరీక్షకు" సంబంధించిన అతి పెద్ద పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధనలు ఎంతగా విజయవంతమయ్యాయి అంటే క్యాన్సర్‌ లక్షణాలు కనిపించేక మునుపే 50 రకాల క్యాన్సర్‌లను గుర్తించగలదు. దీంతో భారత్‌తో సహా అన్ని దేశాలు కేన్సర్‌ గుర్తింపు, చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఎన్‌హెచ్‌ఎస్‌ తెలిపింది. 

(చదవండి: పర్యాటకుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఇక అంతే !: రాజస్తాన్‌)

లక్షణాలు కనిపించక మునుపే.....
ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమండా ప్రిట్‌ చార్డ్‌ మాట్టాడుతు...."ఇది అత్యంత త్వరితగతిన గర్తించే సరళమైన రక్త పరీక్ష . ఈ ప్రయోగం కేన్సర్‌ చికిత్సా విధానంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. అలాగే కేన్సర్‌ లక్షణాలు కనిపించక మునుపే గుర్తించడం వల్ల వైదులు రోగులకు మెరుగైన వైద్యం అందించగలరు. దీంతో  కేన్సర్‌ బాధితుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది." అని అన్నారు. 

ఈ క్రమంలో యూకే కన్సల్టెంట్‌ రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ మమతరావు మాట్లాడుతూ...."ప్రపంచ దేశాలన్నింటికీ ఈ పరిశోధనలు ఎంతగానో ఉపకరిస్తాయి . కేన్సర్‌ లక్షణాల కనపడవ ముందే గుర్తిచడం అంటేనే తక్కువ ఖర్చుతో త్వరితగతిన ఆ వ్యాధి నుండి బయటపడగలం" అని అన్నారు. ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ కేన్సర్‌ 2018లో ప్రపంచ వ్యాప్తంగా సూమారుగా 17 మిలియన్ల మంది క్యాన్సర్‌తో పోరాడుతున్నారని, దాదాపు 9 మిలియన్ల మంది చనిపోయినట్లు తెలిపింది. 

2025 కల్లా అందరికీ అందుబాటులో.....
భారత్‌లోని నేషనల్‌ కేన్సర్‌ రిజిస్టర్‌ ప్రోగ్రాం ప్రతి 68 మంది పురుషులలో ఒకరు ఊపితిత్తుల కేన్సర్‌ బారిన పడుతున్నారని, ప్రతి 29 మంది మహిళలలో ఒకరు బ్రెస్ట్‌ కేన్సర్‌ బారిన పడుతున్నట్లు తెలిపింది.

ఈ క్రమంలో భారత వైద్యురాలు డాక్టర్‌ ప్రీత అరవింద్‌ మాట్లాడుతూ...  "ఈ ప్రయోగాలు ఎంతో ప్రాధాన్యత గలిగినవి.  కొన్ని రకాల కేన్సర్‌లని గుర్తించడానికి స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేయడం సాధ్యం కాదు. ఈ సరికొత్త చికిత్స విధానం ఆ సమస్యను పరిష్కరించింది" అని అన్నారు.

అయితే ఈ చికిత్స విధానాన్ని 2023 కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు రావడానికి సన్నహలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఎన్‌హెచ్‌ఎస్‌  ​2025 కల్లా దాదాపు ఒక మిలియన్ల మంది ప్రజలకు ఈ చికిత్స విధానం అందుబాటులోకి వచ్చేలా  ప్రణాళికలు వేస్తోంది. 2026 కల్లా  ఈ చికిత్స విధానం అన్ని దేశల ప్రజలకు అందే అవకాశం ఉంటుందని యూకే వైద్యురాలు డాక్టర్ మమతరావు ఆశాభావం వ్యక్తం చేశారు.
(చదవండి: మహిళల రక్షణకై నిర్భయ స్క్వాడ్‌: ముంబై)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top