బార్‌ కొచ్చి రచ్చ చేసిన దెయ్యం.. వీడియో వైరల్‌ | UK Bar Shares Video of Ghost Shattering Beer Glass | Sakshi
Sakshi News home page

Ghost Shattering Beer Glass: బార్‌ కొచ్చి రచ్చ చేసిన దెయ్యం.. వీడియో వైరల్‌

Dec 13 2021 1:36 PM | Updated on Dec 13 2021 1:56 PM

UK Bar Shares Video of Ghost Shattering Beer Glass - Sakshi

సీసీటీవీ కెమరాలో రికార్డయిన దృశ్యాలు చూస్తే.. ఒంట్లో వణుకు పుడుతుంది

లండన్‌: సాధారణంగా ఈ ప్రపంచంలో దెయ్యాలకున్న క్రేజ్‌ ఇక మరి వేటికి ఉండదేమో. ఈ అంశంపై లెక్కకు మిక్కిలి పరిశోధనలు కూడా జరిగాయి.. జరుగుతున్నాయి. ఇక ఇంటర్నెట్‌లో దెయ్యాలకు సంబంధించిన వీడియోలు కోకొల్లలు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. చూడబోతే ఇదేదో తాగుబోతు దెయ్యంలా ఉంది. అందుకే బార్‌కు వెళ్లి రచ్చ చేసింది. ఆ వివరాలు..

యూకే, సౌత్ వ్రాక్సాల్, విల్ట్‌షైర్‌లో ఉన్న లాంగ్ ఆర్మ్స్ బార్ వారం రోజుల క్రితం తన ట్విటర్‌లో ఓ వీడియోని షేర్‌ చేసింది. వీడియోలో రికార్డయిన దాని ప్రకారం బార్‌లో టేబుల్‌కి ఇరువైపులా ఓ మహిళ, వ్యక్తి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటి తర్వాత మహిళ అక్కడ నుంచి లేచి వెళ్తుంది. ఆ వెంటనే టేబుల్‌ షెల్ఫ్‌లో ఉన్న ఓ గ్లాస్‌ దానంతట అదే కింద పడుతుంది. 
(చదవండి: అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి)

ఈ సంఘటనతో బార్‌లో ఉన్నవారు ఒక్క క్షణం భయపడతారు. మహిళ అయితే ఆ షాక్‌ నుంచి త్వరగా కోలుకోలేకపోయింది. టేబుల్‌కి అవతల పక్క ఉన్న వ్యక్తి.. అక్కడ ఏమైనా ఉందేమోనని.. చేయి పెట్టి చూస్తాడు. కానీ వారికి ఏం కనిపించదు.. కనీసం తగలదు కూడా. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఈ బార్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదట. 
(చదవండి: ఆకాశంలో నాలుగు చుక్కలు.. గ్రహాంతర వాసులులేనా!?)

గత కొన్నేళ్లుగా ఇలాంటి వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అక్కడ పని చేస్తున్న సిబ్బంది తెలిపారు. తాము కిచెన్‌లో పని చేస్తుండగా.. సడెన్‌గా ఎవరో వచ్చి.. దాని డోర్‌ లాక్‌ చేస్తారని.. కూర్చీలు, టేబుల్స్‌ కదిల్చినట్లు శబ్దాలు వస్తాయని తెలిపారు. ఈ సంఘటనలు చూసి మొదట్లో తాము భయపడ్డామని.. రానురాను అలవాటయ్యింది అని తెలిపారు. 

చదవండి: పబ్‌లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement