అత్యంత అరుదైన పుర్రె....వేలంలో ఏకంగా రూ. 162 కోట్లు

Tyrannosaurus Rex Skull Discovered In Dakota Auction In 162 Crores  - Sakshi

వేల సంవత్సరాల క్రితం డైనోసర్‌ అనే పెద్ద రాక్షస బల్లులు ఉండేవి అని కథలు కథలుగా విన్నాం. టెరన్నోసారస్‌ రెక్స్‌ అనే మరో డైనోసర్‌ జాతి గురించి మనం ఇంతవరకు వినలేదు కదా!. ఇది డైనోసర్‌లో అతి పెద్ధ సరీసృపం. వీటిని టీ రెక్స్‌గా వ్యవహరిస్తారు కూడా. ఇవి ఒకప్పుడూ ఉత్తర అమెరికాలో ఉండేవట. ఐతే వీటీని టెరన్నోసారస్‌ రెక్స్‌ అని ఎందుకంటారంటే..లాటిన్‌లో టీ రెక్స్‌ అంటే రాజు అని అర్థం. అతిపెద్ద థెరోపాడ్‌ డైనోసార్‌ జాతి కాబట్టి దీనిని ఆ పేరుతో వ్యవహరించారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ టీ రెక్స్‌ పుర్రె ఒకటి తవ్వకాల్లో లభించింది. దీన్ని వేలం వేస్తే దాదాపు రూ. 162 కోట్లు వరకు పలుకుతుందంటున్నారు. 

వివరాల్లోకెళ్తే.....యూఎస్‌లోని దక్షిణ డకోటాలో టీ రెక్స్‌ డైనోసర్‌ పుర్రెని కనుగొన్నారు పరిశోధకలు. ఇదోక విలక్షణమైన పుర్రె అని చెబుతున్నారు. ఎలాంటి రసాయనాలతో దీన్ని సురక్షితంగా ఉంచకపోయినప్పటికీ ఇప్పటికీ  ఈ శిలాజం చెక్కు చెదరకుండా ఉండటంతో పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వెలికితీసిన పుర్రె ఆకారం ఉపరితలం చాలా వరకు పాడవ్వవకుండా ఉండేటేమే కాక, అతి సున్నితమైన ఎముకలు సైతం చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు.

ఈ పుర్రె సుమారు 6 నుంచి 7 అడుగులతో దాదాపు 200 పౌండ్లపైన బరువు ఉండచ్చని చెబుతున్నారు. ఇది సుమారు 76 మిలియన్ల ఏళ్ల పురాతనమైనదని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ టైరన్నోసారస్‌ తన జాతిలో మరో టైరన్నోసారస్‌తో తలపడి ఉండవచ్చని, అందువల్లే దాని పుర్రెలో రెండు పంక్చర్‌లు కనిపిస్తున్నాయని అన్నారు. ఇలాంటి జీవి పుర్రె తవ్వకాల్లో లభించడం అత్యంత అరుదని చెబుతున్నారు. ఐతే ఈ జీవి పుర్రె చెక్కు చెదరలేదుగానీ అస్తిపంజరం చాలావరకు కోతకు గురైందని అన్నారు. ఈ పుర్రెని మాక్సిమస్‌గా పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది వేలంలో సుమారు రూ.122 కోట్లు నుంచి రూ.162 కోట్లు వరకు పలుకుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 

(చదవండి: మహా సిగ్గరి కోసం అలుపెరగని ప్రయాణం.. చివరికి ఇలా ‘అద్భుతంగా’ చిక్కింది!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top