వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి తలొగ్గారు. సుంకాల విషయంలో ఆయన చేసిన తాజా ప్రకటన అందుకు నిదర్శనంగా నిలిచింది. ‘ఏదో ఒక సమయంలో సుంకాలను తగ్గించాలని అమెరికా యోచిస్తోందని, భారతదేశంతో తాము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గరగా ఉన్నామని ట్రంప్ అన్నారు. భారతదేశంతో జరుగుతున్న వాణిజ్య చర్చల గురించి విలేకరులు అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తమ దేశం సుంకాలను తగ్గిస్తుందని ప్రకటించారు. రష్యాతో చమురు వ్యాపారం కారణంగా భారత్ తమ నుంచి అధిక సుంకాలను ఎదుర్కొంటున్నదని అంటూనే, న్యూఢిల్లీ.. రష్యా చమురు కొనుగోలును నిలిపివేసిందని కూడా అన్నారు. ఆగస్టులో భారత దిగుమతులపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేసిన కొన్ని నెలల తర్వాత అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. గత కొంతకాలంగా భారత్- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ట్రంప్ భారత్.. రష్యాతో తన చమురు వాణిజ్యాన్ని ముగించబోతున్నదని పలుమార్లు అన్నారు.
VIDEO | Washington: Responding to a question during a press conference at White House, US President Donald Trump (@POTUS) said: "Tariffs high on India because of Russian oil; they've reduced Russian oil substantially, at some point will bring tariffs down."
(Source: Third Party)… pic.twitter.com/UhjGRqPKxa— Press Trust of India (@PTI_News) November 11, 2025
ట్రంప్ తొలిసారి ఈ ప్రకటన చేసినప్పుడు, ప్రధాని మోదీ నుండి తనకు వచ్చిన హామీ వచ్చిందని, దాని ఫలితమే ఇది అని అన్నారు. అయితే అప్పట్లో ఇరు నేతల మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణ జరగలేదని భారత్ స్పష్టం చేసింది. నేడు(మంగళవారం) జరగబోతున్న వాణిజ్య చర్చల గురించి అడిగినప్పుడు, ట్రంప్ ఇలా అన్నారు ‘మేము భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఇది గతంలో చేసుకున్న దానికంటే చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం, వారు నన్ను ప్రేమించడం లేదు. అయితే ఇప్పుడు మళ్లీ మమ్మల్ని ప్రేమిస్తారు. మేము న్యాయమైన ఒప్పందాన్ని చేసుకుంటాం. మేము దగ్గరవుతున్నాం’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: హఫీజ్ మరో కుట్ర:‘బంగ్లా’ నుంచి భారత్‌పై దాడులు?


