భారత్‌పై మరోసారి ట్రంప్ అక్కసు... | trump says india took advantage us trade deal modi | Sakshi
Sakshi News home page

భారత్‌పై మరోసారి ట్రంప్ అక్కసు...

Jun 5 2026 10:20 PM | Updated on Jun 5 2026 10:34 PM

trump says india took advantage us trade deal modi

వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి భారత్‌పై అక్కసు వెల్లగక్కారు. చాలా కాలంగా భారత్, అమెరికాపై అధిక సుంకాలు విధించి భారీగా లాభాలు పొందిందందన్నారు. ఇప్పుడు ఆ పని అమెరికా చేస్తుందన్నారు. ఇటీవల ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

దీర్ఘకాలంగా ఉన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా, 2026 ఫిబ్రవరిలో భారత్, అమెరికా దేశాల మధ్య ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. అనంతరం ఇటీవలే న్యూఢిల్లీలో అమెరికా బృందం పర్యటించింది. భారత ప్రభుత్వ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు దాదాపు ఫైనల్‌ అయ్యాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిస్థితులు నడుమ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

ట్రంప్ మాట్లాడుతూ" ఇంతకాలం భారత్‌, అమెరికాపై అధిక పన్నులు విధించి లాభపడింది. ఇప్పుడు అది మావంతు. అమెరికా, భారత్ మధ్య త్వరలోనే ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం కుదరవచ్చు. ఎందుకంటే "నాకు మోదీ అంటే చాలా ఇష్టం. మోదీ నాకు చాలా మంచి స్నేహితుడు. మా మధ్య మంచి సంబంధం ఉంది, మేము ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటాము."అని అన్నారు.

కాగా బలవంతపు కార్మిక వ్యవస్థను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్న కొన్ని దేశాలపై అదనపు దిగుమతి సుంకాలను (టారిఫ్‌లను) విధించాలని అమెరికా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదిత జాబితాలో భారతదేశం కూడా ఉంది. దీనిని అమలు చేస్తే, అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై అదనంగా 12.5% ​​సుంకం విధించబడవచ్చు. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. దీంతో ఎగుమతులు ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement