‘2027 నుంచి వచ్చాను.. భూమ్మీద నేనే చివరి వ్యక్తిని’

TikToker Claims To Be Time Traveller From 2027 - Sakshi

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న వీడియో

Tiktok Time Traveler 2027: టైమ్‌ ట్రావెలింగ్‌ గురించి ఇప్పటికే చాలా కథలు, కథనాలు వెలువడ్డాయి. ఇక టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు టైమ్‌ ట్రావెలింగ్‌ మీద ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. నిజంగా కాలంలోకి ప్రయాణించగలిగితే.. మన జీవితాలు ఎలా ఉండేవో కదా. ఇప్పటికైతే.. కాలంలోకి ప్రయాణించడం అనేది సినిమాల్లో తప్ప వాస్తవంగా ఎక్కడా చోటు చేసుకోలేదు. భవిష్యత్తులో చెప్పలేం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే తాజాగా టిక్‌టాక్‌లో ఈ టైమ్‌ట్రావెలింగ్ ట్రెండ్‌ నడుస్తోంది.

ఓ టిక్‌టాక్‌ యూజర్‌ తాను టైం ట్రావెలర్‌ని అని..  2027 నుంచి ప్రస్తుత కాలానికి వచ్చానని.. భూమ్మీద తాను మాత్రమే మిగిలి ఉన్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజనులు ప్రశ్నలతో సదరు యూజర్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఆ వివరాలు..
(చదవండి: ఇప్పట్లో ప్రపంచం అంతం కాదు.. ఇదిగో ప్రూఫ్‌లు)

టిక్‌టాక్‌ యూజర్‌ యూనికోసోబ్రెవివియంట్ సోమవారం 21 సెకన్ల నిడివి గల వీడియోని తన టిక్‌టాక్‌ అకౌంట్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్‌ చేశాడు. దీనిలో ఎత్తైన బిల్డింగ్‌లు, పార్క్‌ చేసి ఉన్న కార్లు తప్ప మనుషులు కనిపించలేదు. ఇక యూజర్‌ కనిపించకుండా కేవలం మాటలు మాత్రమే వినిపిస్తాయి. దీనిలో అతడు ‘‘నా పేరు జేవియర్.. నేను 2027 నుంచి ప్రస్తుత కాలానికి వచ్చాను. ఈ భూమ్మీద మిగిలి ఉన్న ఏకైక మనిషిని నేనే’’ అనడం వీడియోలో వినిపిస్తుంది.
(చదవండి: ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా?)

ఈ వీడియో తెగ వైరలయ్యింది. ఇప్పటివరకు దీని 2.2 మిలియన్ల మందికి పైగా చూశారు. ఇక దీనిపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రోడ్డు మీద ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. కచ్చితంగా ఇది లాక్‌డౌన్‌లో తీసిన వీడియోనే. ఇంట్లో కూర్చుని పిచ్చెక్కి ఇలాంటి వీడియోలు తీశాడేమో.. ఈ ప్రపంచంలో నువ్వే చివరి వ్యక్తివి అయితే ట్రాఫిక్‌ లైట్లు ఎలా కనిపిస్తున్నాయి’’ అంటూ ప్రశ్నించసాగారు. 

(చదవండి: టిక్‌టాక్‌తో చిత్ర విచిత్రంగా కన్ను కొట్టేస్తున్నారు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top