పాకిస్తాన్‌లో రెచ్చిపోయిన తాలిబన్లు.. పోలీస్ స్టేషన్‌ను సీజ్ చేసి.. 9 మంది అధికారులను..

పాకిస్తాన్‌లో రెచ్చిపోయిన తాలబన్లు.. పోలీస్ స్టేషన్‌ను సీజ్ చేసి.. - Sakshi

ఇస్లామాబాద్‌: తాలిబన్ మిలిటెంట్లు పాకిస్తాన్లో రెచ్చిపోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌ను నిర్భంధించారు. అంతేకాదు ఉగ్రవాద వ్యతిరేక శాఖ భద్రతా సిబ్బందిని స్టేషన్‌లో బంధించారు. ఆదివారం ఈ ఘటన జరిగింది.

అయితే స్టేషన్‌లో ఉన్న తమవాళ్లను విడిపించుకునేందుకే తాలిబన్లు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌ను పూర్తిగా తమ నియంత్రణలో ఉందని, 9 మంది సిబ్బందిని బంధించినట్లు తాలిబన్లు ఓ వీడియో విడుదల చేశారు. వాళ్లను విడిచిపెట్టాలంటే తమను క్షేమంగా దేశం దాటించి అఫ్గానిస్తాన్ చేరుకునేందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

తాలిబన్లు స్టేషన్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్న అనంతరం పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. తాలిబన్లు బయటి నుంచి దాడి చేశారా? లేక స్టేషన్‌ లోపలికి వెళ్లి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. వారి చెర నుంచి అధికారులను విడిపించేందుకు పాక్ సైన్యం ప్రయత్నిస్తోంది.
చదవండి: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి.. ఫ్యాన్స్ ఆగ్రహం.. ఫ్రాన్స్‌లో ఘర్షణలు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top