FIFA World Cup Final: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి.. ఫ్యాన్స్ ఆగ్రహం.. ఫ్రాన్స్‌లో చెలరేగిన ఘర్షణలు..

Riots Break Paris After France Loses Argentina Fifa World Cup Final - Sakshi

పారిస్‌: ఆద్యంతం ఉత్కంఠసాగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఓడిపోడవడంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి ఘర్షణలు చెలరేగాయి. పలుచోట్ల అభిమానులు పోలీసులతో బాహాబాహీకి దిగారు. ఫలితంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే హింసకు పాల్పడిన వందల మంది అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు.

ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే ప్రఖ్యాత ఛాంప్స్-ఎలిసీస్‌ అవెన్యూకు వేల మంది అభిమానులు తరలివెళ్లారు. దీంతో ఆ ప్రాంతం కిక్కిరిసి ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. భద్రత కోసం వేల మంది పోలీసులను మోహరించారు. అయితే మ్యాచ్ జరిగినంతసేపు ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం.. పెనాల్డీ షూటౌట్‌ ఫ్రాన్స్ ఓడిపోవడంతో ఉద్రిక్తంగా మారింది. వేల మంది అభిమానులు ఆగ్రహంతో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పోలీసులపైకి బాణసంచా విసిరారు. ఘర్షణకు కూడా దిగారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఆదివారం రాత్రి జరిగిన ఫిపా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అదనపు సమయం ముగిసే సరికి ఫ్రాన్స్- అర్జెంటీనా చెరో మూడు గోల్స్ చేసి సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో 4-2 తేడాతో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం సాధించింది. ఫలితంగా 36 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.  అయితే తమ జట్టు ఓడినప్పటికీ గర్వపడే ప్రదర్శన చేసిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మేక్రాన్ పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం తమ టీం సభ్యులను ఓదార్చారు.


చదవండి: ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 19 మంది దుర్మరణం..

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top