చైనా బల ప్రదర్శన.. ఏకంగా 27 విమానాలు బఫర్ జోన్‌లో ప్రవేశం

Taiwan Says 27 Chinese Aircraft Enter Its Air Defence Buffer Zone - Sakshi

తైవాన్‌: చైనా దేశం తైవాన్‌పై మరోసారి బలప్రదర్శనకు దిగింది. తమ యుద్ధవిమానాలను తైవాన్ గగనతలంలోకి పంపించింది. మొత్తం 27 విమానాలు బఫర్ జోన్‌లోకి ప్రవేశించాయని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. తమ యుద్ధవిమానాల ద్వారా హెచ్చరించగా.. చైనా విమానాలు పసిఫిక్ మహా సముద్రం మీదుగా వెనుతిరిగాయని అధికారులు తెలిపారు.

చదవండి: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ ప్రకంపనలు..భారత్‌లోనూ దడ

ఏడాది కాలంగా తైవాన్‌పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుతూ.. చైనా ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే. ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో 150కిపైగా యుద్ధ విమానాలను తైవాన్‌ దేశం మీదకు వెళ్లాయి. కాగా, తైవాన్‌ను తన అంతర్భాగంగా చెబుతున్న చైనా.. ఆ దేశాన్ని పూర్తిగా తమలో కలుపుకుంటామని, అవసరమైతే సైనిక చర్యకూ వెనకాడబోయేది లేదంటోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top