రష్యాలో ఒళ్లు విరుచుకున్న అగ్నిపర్వతాలు | Sakshi
Sakshi News home page

రష్యాలో ఒళ్లు విరుచుకున్న అగ్నిపర్వతాలు

Published Tue, Nov 22 2022 6:08 AM

Strong quake awakens 2 volcanoes in Russia - Sakshi

మాస్కో: రష్యాలో రాజధాని మాస్కోకు 6,600 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్‌ మహాసముద్రంలో కంచట్కా ద్వీపకల్పంలో రెండు అగ్నిపర్వతాలు నిద్రాణ స్థితి నుంచి మేల్కొని ఒళ్లు విరుచుకున్నాయి. భారీ పరిమాణంలో లావాను వెదజల్లుతున్నాయి. వాటినుంచి వెలువడుతున్న లావా, ధూళి మేఘాలు సుదూరాల దాకా కన్పిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

అతి త్వరలో పూర్తిస్థాయిలో బద్దలయ్యే ప్రమాదముందన్నారు. శనివారం సంభవించిన గట్టి భూకంపమే ఇందుకు కారణమట. వీటిలో క్లుచెవ్‌స్కయా స్పోకా అగ్నిపర్వతం నుంచి గంటకు ఏకంగా పదిసార్లు భారీ పేలుళ్లు వెలువడుతున్నాయట! 4,754 మీటర్ల ఎత్తులో ఉన్న ఇది యురేషియాలోకెల్లా అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం. కంచట్కా ద్వీపకల్ప ప్రాంతం ఏకంగా 30కి పైగా చురుకైన అగ్నిపర్వతాలకు నిలయం! 

Advertisement
Advertisement