ఆమె గుండె చప్పుడు వినిపించడమే కాదు.. కనిపిస్తోంది కూడా!

She Explains About The Impact Of Three surgeries Have Had On Her Life - Sakshi

అత్యధునిక టెక్నాలజీతో కూడిన వైద్య విధానంలో మనం చాలా రకాల సర్జరీలు గురించి వినే ఉంటాం. కానీ కొన్న సర్జరీల వల్ల జరిగే దుష్పరిణామాలు గురించి ఇటీవలకాలంలో తరుచుగా వింటున్నాం. కానీ అత్యవసర పరిస్థితిలో రోగిని రక్షించే నిమిత్తం తప్పనిసరై అలాంటి శస్త్ర చికిత్సలు చేస్తారు. అయితే ఇటీవలకాలంటో గుండె మార్పిడికి సంబందించిన శస్త్ర చికిత్సలు గురించి  వింటున్నాం. కానీ ఇక్కడొక అమ్మాయి అలాంటి శస్త్ర చికిత్స చేయించుకోవడం ఎలా దుష్పరిణామాలను ఎదుర్కుందో చూడండి. 

గుండె మార్పిడి అనేది వైద్యంలో అత్యంత క్లిష్టమైన  శస్త్రచికిత్సా విధానాలలో ఒకటి. ఇది వైద్య విధాంలో అత్యద్భుతమైన శస్త్ర చికిత్స. అయితే సిసిలియా-జాయ్ అడమౌ అనే 22 ఏళ్ల మహిళ గుండెకు సంబందించిన ఎడమ కర్ణిక ఐసోమెరిజంతో అట్రియో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్‌(గుండెకు ఎడమవైపు రంధ్రాలు ఏర్పడటం)తో జన్మించింది. దీంతో ఆమెకు గుండె మార్పిడి చికిత్స చేయాల్సి వచ్చింది.

(చదవండి: వామ్మో! అంత ఎత్తులోంచి ఒకేసారి దూకేసారు... చివరికి)

ఈ మేరకు ఆమెకు 2010లో 45 ఏళ్ల వ్యక్తి నుంచి ఆమెకు  గుండె మార్పిడి జరిగింది. దీంతో ఆమె తర్వాత ఆరునెలలకే మూత్రపిండాల మార్పిడికి సంబంధించిన సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే ఆమెకు 11 ఏళ్ల ప్రాయంలో జరిగిన ఈ రెండు శస్త్ర చికిత్స ఆమె జీవితాన్నే మార్చేశాయి. తదనంతరం నాలుగేళ్లకే బ్రెయిన్‌లో ఏర్పడిన కణుతులు కారణంగా మరో ఆపరేషన్‌ చేయించుకుంది. ఈ సర్జరీల కారణంగా ఆమె రకరకాల దుష్పరిణామాలను ఎదుర్కొంది. అయితే ఆమెకు జరిగిన గుండె మార్పిడి సర్జరీ కారణంగా ఆమె గుండె కొట్టుకుని తీరు అందరికి కనిపించేలా కొట్టుకుంటింది.

ఈ శస్త్ర చికిత్సతల తాలుకు మచ్చలు ఆమె శరీరం మీద గుర్తులుగా మిగిలిపోయాయి.  ఏది ఏమైన ఒక శస్త్ర చికిత్స చేయిస్తే ఇంకో దుష్పరిణామం ఎదుర్కొవ్వడం మళ్లీ మరో చికిత్సా ఇలా ఆమె మూడు ప్రమాదరకరమైన శస్త్ర చికిత్సలు చేయించుకుంది. ఈ మేరకు ఆమె టిక్‌టాక్‌లో తాను ఈ శస్త్ర చికిత్స వల్ల తాను ఎదర్కొన్న సమస్యలను గురించి వివరిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: వింతైన ఇల్లు దీని ధర ఎంత తెలుసా?)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top