మొక్కలు కూడా ఏడుస్తాయ్‌! శబ్దాల రూపంలో బాధను వెల్లడిస్తాయట

Scientists Found Plants Cry When Stressed After Hearing Screams - Sakshi

మనుషుల్లానే మొక్కలు కూడా ఒత్తిడికి గురైతే ఏడుస్తాయట. తమ ఆవేదనను శబ్దాల రూపంలో వెళ్లగక్కుతాయట. అయితే వాటిని మనం వినలేం! అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా అధయనాల్లో పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. పరిశోధనల్లో మొక్కలు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయని తేలిందని కూడా చెప్పారు. ఈ మేరకు ఇజ్రాయెల్‌కి చెందిన టెల్‌ అవీవ్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఒత్తిడికి గురైతే సహాయం కోసం మొక్కలు అరుస్తాయని కనుగొన్నారు.

దీని కోసం టొమాటో, పొగాకు వంటి మొక్కలను గ్రీన్‌హౌస్‌ లోపల ఉంచి పరిశోధన చేసినప్పుడూ.. అవి డీహైడ్రేట్‌ అయ్యి ఏడుపు రూపంలో శబ్దాలను విడుదల చేయడం గమనించారు. ప్రతి మొక్క ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడూ ఒక్కో రకమైన నిర్ధిష్ట శబ్ద రూపంలో ధ్వనిని ప్రదర్శించాయని చెప్పారు. మానవులు గబ్బిలాలు, కీటకాలు, ఎలుకలు వంటి వివిధ జంతువుల శబ్దాన్ని వినగలరు. మహా అయితే 16 కిలో హెర్ట్జ్‌ వరకు మాత్రమే మానవులు వినగలరు. పరిశోధనలో మెక్కలు 10 సెంటీమీటర్ల​ పరిధిలో ఉన్న 20 నుంచి 250 పౌనఃపున్యాల శబ్దాలను అందుకుంటాయని అల్ట్రాసోనిక్‌ మైక్రోఫోన్‌ల ద్వారా గుర్తించారు.

మొక్కలకు తగు మోతాదు నీరు అందనప్పుడూ, లేదా కొమ్మలకు/కాండానికి గాయాలైనప్పుడు వాటి నుంచి ఏడుపు రూపంలో శబ్దాలు రావడాన్ని గుర్తించినట్లు తెలిపారు. మొక్కలు విడుదల చేసే శబ్దాలను గబ్బిలాలు, ఎలుకలు, కీటకాలు వంటివి గుర్తించగలవని, అవి మొక్కల నుంచి సంబంధిత సమాచారాన్ని కూడా పొందగలవని పరిశోధకుడు లిలాచ్‌ హడానీ చెప్పుకొచ్చారు. 

(చదవండి: రెండో పెళ్లి కావలి అంటూ పోలీస్టేషన్‌లో వధువు హల్‌చల్‌! మద్యంమత్తులో ఊగిపోయి..)
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top