ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు | Russian attacks kill six in Ukraine, officials say | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు

Mar 23 2026 1:46 AM | Updated on Mar 23 2026 1:46 AM

Russian attacks kill six in Ukraine, officials say

ఉక్రెయిన్‌పై రష్యా దళాలు జరిపిన తాజా దాడుల్లో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో నాలుగు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. దక్షిణ నగరం జపోరిజ్జియాలో శనివారం ఒక నివాస గృహంపై డ్రోన్ దాడి జరగగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా ఎనిమిది మంది గాయపడ్డారు.

సమీపంలోని డ్నిప్రోపెట్రోవ్‌స్క్ ప్రాంతంలో మరో ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. తూర్పు డోనెత్స్క్ మరియు దక్షిణ ఖెర్సన్ ప్రాంతాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.  

ఈ దాడులు జరుగుతున్న సమయంలో అమెరికా–ఉక్రెయిన్ ప్రతినిధులు ఫ్లోరిడాలో చర్చలు జరుపుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్‌ యుద్దం మొదలైన తర్వాత రష్యా ఉక్రెయిన్‌పై విస్తృత దాడులు జరపడం ఇదే మొదటిసారి. కాగా, పశ్చియాసియాలో జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్‌ అమెరికా-ఇజ్రాయెల్‌కు మద్దతు పలకగా.. రష్యా ఇరాన్‌ పక్షాన ఉంది. 

2022లో మొదలై నేటికీ కొనసాగుతుంది..!
రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్దం 2022లో మొదలై, నేటికీ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌ అనూహ్య ప్రతిఘటనతో ఇటీవలికాలంలో రష్యా దాడులను కాస్త తగ్గించింది. ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనే ఉద్దేశంతో రష్యా ఈ యుద్దాన్ని మొదలుపెట్టింది.

 

Advertisement
 
Advertisement
Advertisement