రష్యా బలగాలు విఫలం?..అందుకే బెలారస్‌ దిగనుందా?

Russia Ukraine War: Belarus May Join Putin In Ukraine Invasion - Sakshi

Belarus may join Ukraine war: ఐక్యరాజ్యసమితిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన పలు వాదనలు వినిపించాయి. గత వారం రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 3 వేల మంది రష్యన్‌ సైనికులు మరణించారని,  దాదాపు 200 మంది సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నామని ఉక్రెయిన్‌ పేర‍్కొంది . అయితే వాటిని క్రెమ్లిన్‌ తిరస్కరించింది.

ముందస్తు షరతులు లేకుండా చర్చలు జరపడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ చెప్పారు. అయితే ఇప్పటి వరకు మాస్కో ఉక్రెయిన్‌ పై జరిపిన దాడిలో 14 మంది చిన్నారులతో సహా 352 మంది మరణించగా, 116 మంది చిన్నారులతో సహా వెయ్యి మంది గాయపడ్డారని తెలిపారు. మరోవైపు బెలారస్‌ కూడా రష్యాతో జత కట్టి ఉక్రెయిన్‌కి ఊహించని ఝలక్‌ ఇచ్చింది. మాస్కో దాడితో ఉక్రెయిన్‌లోని రష్యా బలగాలు క్షీణించడంతో వారికి సాయంచేసేందుకు బెలారస్‌ తన దళాలలను పంపనుందని సమాచారం.

 ముఖ్యాంశాలు:

  • ఉక్రెయిన్‌ పై యుద్ధం చేస్తున​ వేళ రష్యా అధ్యక్షుడు మరో కీలక ప్రకటన చేశారు. దేశంలో అణ్వాయుద దళాలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి తోపాటు సాయుధ దళాల జనరల్‌ చీఫ్‌ స్టాఫ్‌ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఆదేశిశించారు.
  • మరోవైపు ఉక్రెయిన్‌ పై రష్య చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ ప్రపంచదేశాల గత కొన్నిరోజులుగా రష్యా పై పలు ఆంక్షల విధించాయి. దేశంలో అతి పెద్ద  బ్యాంకు అయిన స్విఫ్ట్‌ నుంచి రష్యాకి సంబంధించిన కీలక బ్యాంకులను తొలగిస్తానంటూ ఊహించని షాక్‌ ఇచ్చింది. 
  • యూకే ప్రధాన మంత్రి  బోరిస్ జాన్సన్‌తో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ జరిపిన చర్చల్లో రాబోయే 24 గంటలు ఉక్రెయిన్‌కి కీలకం' అని చెప్పారు. ఉక్రెయిన్‌కి కావల్సిన రక్షణ సాయాన్ని యూకే దాని మిత్ర దేశాలు తప్పక చేస్తాయని జాన్సన్‌ హామీ ఇచ్చారు.
  • రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ తమ సహచరుల్లో కూడా చనిపోయిన వారు ఉన్నారని కానీ ఉక్రెయిన్‌ దళాలతో పోలిస్తే రష్యా చాలా తక్కువ మందిని మాత్రమే నష్టపోయిందని నొక్కిచెప్పారు.
  • యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, 27-దేశాల కూటమి రష్యన్‌ యాజమాన్యం ఆధ్వర్యంలోనివి లేదా నియంత్రణలో ఉన్న విమానాల కోసం గగనతలాన్ని మూసివేస్తుందని చెప్పారు. అంతేకాదు ఒలిగార్చ్‌ల ప్రైవేట్ జెట్‌లతో సహా  కెనడా కూడా రష్యన్ ఎయిర్‌లైన్స్ కోసం తన గగనతలాన్ని మూసివేసిందని తెలిపారు.

(చదవండి: బ్యాంక్‌ దిగ్బంధనం... ఏటీఎంకి క్యూ కట్టిన రష్యన్‌ వాసులు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top