బ్రిటన్‌ రాణి శవపేటిక వద్ద ఊహించని ఘటన.. ఒక్కసారిగా కుప్పకూలిన రాయల్ గార్డ్‌!

Royal Guard Faints And Fall Near Queen Elizabeth Coffin - Sakshi

బ్రిటన్‌ను సుదీర్ఘ కాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 ఇటీవలే తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా. రాణి అంత్యక్రియలు సెప్టెంబర్‌ 19న ఉదయం చారిత్రక వెస్ట్‌ మినిస్టర్‌ అబేలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ.. రాణి అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. విండ్సర్‌ క్యాజిల్‌లోని సెయింట్‌ జార్జ్‌ చాపెల్‌లో భర్త చార్లెస్‌ సమాధి పక్కనే ఖననం చేస్తారు.

ఇక, రాణి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం సెప్టెంబర్‌ 14 నుంచి 4 రోజులు ప్రజల సందర్శనార్థం వెస్ట్‌మినిస్టర్‌ హాల్లో ఉంచుతారు. ఇందులో భాగంగా రాణి పార్థివ దేహాన్ని ఆమె మృతి చెందిన బాల్మోరల్‌ కోట నుంచి ఆదివారం ఉదయం రోడ్డు మార్గాన ఎడింబరోలోని హోలీ రుడ్‌హౌజ్‌ కోటకు తరలించారు. మంగళవారం అక్కడి నుంచి విమానంలో లండన్‌కు తీసుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో క్వీన్స్ శవపేటికను కాటాఫాల్క్ అని పిలిచే ఎత్తైన వేదికపై ఉంచారు.  రాణి పార్థివదేహాన్ని సందర్శించి పెద్ద సంఖ్యలో ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఈ తరుణంలో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. శవపేటిక వద్ద విధులు నిర్వహిస్తున్న రాయల్స్‌ బాడీగార్డ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు నిల్చున్న ఓ గార్డ్‌.. కిందపడిపోవడంలో అక్కడున్న ఇతర గార్డ్స్‌ అతడి వద్దకు పరిగెత్తుకుని వచ్చారు. కాగా, సదరు గార్డ్‌ నీరసంగా ఉన్న కారణంగా కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top