జ్యోతి మల్హోత్రాకు పాకిస్తానీ రిటైర్డ్‌ అధికారితో లింకు ? | Retired Pakistani Officer Nasir Linked to Jyoti Malhotra | Sakshi
Sakshi News home page

జ్యోతి మల్హోత్రాకు పాకిస్తానీ రిటైర్డ్‌ అధికారితో లింకు ?

Jun 7 2025 1:41 PM | Updated on Jun 7 2025 3:09 PM

Retired Pakistani Officer Nasir Linked to Jyoti Malhotra

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ కోసం గూఢచర్యం చేసిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా కేసులో పలు ఆసక్తికర వివరాలు వెలుగుచూస్తున్నాయి. పాకిస్తానీ రిటైర్డ్ అధికారి నాసిర్ ధిల్లాన్‌తో జ్యోతి మల్హోత్రాకు సంబంధం ఉన్నట్లు తాజాగా వెల్లడయ్యింది. దర్యాప్తు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం జ్యోతికి ధిల్లాన్‌తో నేరుగా సంబంధం ఉంది. ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో అతని పక్కన కనిపించింది.

పాకిస్తాన్ పర్యటన కోసం వచ్చిన జ్యోతిని నాసిర్ ధిల్లాన్ కలుసుకున్నాడు. పాకిస్తాన్‌ పోలీసు దళం నుంచి పదవీ విరమణ చేసిన ఆయన సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. ధిల్లాన్ పాకిస్తాన్ ఐఎస్‌ఐతో పాటు సైన్యం ఆదేశాల మేరకు పనిచేస్తుంటాడని, నిఘా సమాచారం రాబట్టేందుకు భారతీయ యూట్యూబర్‌లతో అతను స్నేహం చేస్తుంటాడని అధికారులు చెబుతున్నారు.

భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించడడమే లక్ష్యంగా దిల్లాన్‌ పనిచేస్తుంటాడని అధికారులు తెలిపారు. ధిల్లాన్ తన ప్లాన్‌లో భాగంగా మొదట భారత్‌కు చెందిన యూట్యూబర్ల  నమ్మకాన్ని సంపాదిస్తాడని, అనంతరం వారిని ఐఎస్‌ఐ ఏజెంట్లకు పరిచయం చేస్తాడని, వారు యూట్యూబర్లకు గూఢచర్యానికి సంబంధించిన పనులను అప్పగిస్తారని అధికారుల దర్యాప్తులో తేలింది. 

ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం షిండేకు షాకిచ్చిన పైలట్‌
 

Advertisement
 
Advertisement
Advertisement