Fire Accident: దారుణం: ఫిలిప్పిన్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి, 80 ఇళ్లు దగ్ధం

Philippines Housing Fire Accident Several Dead And Injured - Sakshi

ఫిలిప్పిన్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జనసంద్రమైన ఓ బస్తీలోని ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు చెప్పారు. వివరాల ప్రకారం.. మెట్రో మనీలాలోని స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్‌లోని సమీపంలోని నివాస ప్రాంతంలో సోమవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

క్యూజోన్ సిటీ సబర్బ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ కాంపౌండ్‌లో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5 గంటలకు మంటలు భారీగా చెలరేగాయి. దీంతో బాధితులు తమ ఇళ్లలో చిక్కుకుపోయారు. ఒకే ఇంట్లో చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. సమాచారం ప్రకారం సుమారు 80 ఇళ్ళు కాలిపోగా, 250 కుటుంబాలు ఈ ప్రమాదం వల్ల తీవ్రంగా నష్టపోయారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేసింది.  కాగా ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

చదవండి: తక్కువ అంచనా వేశారు.. రష్యన్‌ బోట్లను పేల్చేశాం: ఉక్రెయిన్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top