Pani Puri Banned: పానీ పూరీ అమ్మకాలను నిషేధించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ!

Pani Puri Has Been Banned In Nepals Kathmandu - Sakshi

ఖట్మండు: నేపాల్‌లోని ఖాట్మండు వ్యాలీలో పానీ పూరీ అమ్మకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. పానీపూరీలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉ‍న్నట్లు అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే పానీ పూరీ అమ్మకాలను నిషేధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు లలిత్ పూర్‌ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు అధికంగా నమోదయ్యాయని తెలిపారు.

ప్రస్తుతం దేశంలో కలరా రోగుల సంఖ్య 12కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల ఈ కలరా వ్యాప్తిని అరికట్టేందుకు మహానగరాల్లోనూ, రద్దీ ప్రాంతాలు, కారిడార్‌ వంటి ప్రాంతాల్లో పానీ పూరీ విక్రయాలను నిషేధించారు. అంతేకాదు ఎవరికైన కరోనా లక్షణాలు కనిపించినట్లయితే సమీప ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని ప్రజలను అధికారులు కోరారు. ముఖ్యంగా వేసవి, వర్షాకాలాల్లో డయేరియా, కలరా వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది.

(చదవండి:  ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top