మేము డేంజరా? మరి భారత్‌? బైడెన్ వ్యాఖ్యలపై పాక్ తీవ్ర అభ్యంతరం

Pakistan Summons Us Envoy After Joe Biden Remarks - Sakshi

ఇస్లామాబాద్‌: అణ్వాయుధ సమన్వయం లేని పాకిస్థాన్‌ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బైడెన్ వాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్‌కు సమన్లు పంపింది.

పాకిస్థాన్ తన సమగ్రత, భద్రత విషయంలో మొండిగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అన్నారు. ఒకవేళ ప్రశ్నలు లేవనెత్తాల్సి వస్తే భారత్‌లో అణ్వాయుధాలపై కూడా ప్రశ్నించాలని పేర్కొన్నారు. బైడెన్ కామెంట్లు తనను షాక్‌కు గురిచేశాయని భుట్టో అన్నారు. సమన్వయ లోపం వల్లే బైడెన్ పొరబడి ఉంటారని చెప్పారు. 

లాస్ ఏంజెల్స్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పాకిస్థాన్ అత్యంత ప్రమాదకర దేశమని బైడెన్ అన్నారు. పాక్ ప్రధాని అమెరికాతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top