ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగాల ప్రసారంపై నిషేధం | Pakistan: Media Regulatory Body Bans Broadcasting Imran Khan Sspeeches | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగాల ప్రసారంపై నిషేధం

Published Sun, Nov 6 2022 9:16 AM | Last Updated on Sun, Nov 6 2022 9:16 AM

Pakistan: Media Regulatory Body Bans Broadcasting Imran Khan Sspeeches - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేలా, పౌరుల మధ్య విద్వేషం పెంచేలా ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగాల ప్రసారం వెంటనే ఆపేయాలని టీవీ చానళ్లను దేశ ఎలక్ట్రానిక్‌ మీడియా, రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్‌ఏ) ఆదేశించింది. వీటిని ఉల్లంఘిస్తే షోకాజ్‌ కూడా ఇవ్వకుండా నేరుగా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది.

‘లాంగ్‌ మార్చ్‌ పేరిట ఇమ్రాన్‌ చేపట్టిన ర్యాలీ సందర్భంగా ఇటీవల చేసిన పలు ప్రసంగాల్లో.. తన హత్యకు కుట్ర పన్నాయంటూ సైన్యంసహా దేశ అత్యున్నత విభాగాలపై నిరాధార ఆరోపణలు చేశారు. ఈ ప్రసంగాలు ప్రజల మధ్య విద్వేషం పెంచే ప్రమాదముంది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ఇలాంటి ప్రసంగాల ప్రసారం ఆపేయండి’ అని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement