హార్మూజ్‌ తరంగాలపై భారత నావికుడి సాహసం..! | Operation Tik Tok Shocking Incident On Mumbai Beach Dark Mode | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌ తరంగాలపై భారత నావికుడి సాహసం..!

Mar 23 2026 9:43 PM | Updated on Mar 23 2026 9:58 PM

Operation Tik Tok Shocking Incident On Mumbai Beach Dark Mode

ఇది భారత నావికుడి సాహసం.. ఒకవైపు భీకర యుద్ధం. మరొకవైపు ఓ నౌక హార్మూజ్‌ జలసంధిని దాటిన వైనం. అయితే భారత నావికుడు అత్యంత ధైర్య సాహసాలతో దాన్ని హార్మూజ్‌ జలసంధి దాటించడమే కాదు.. భారత్‌కు తీసుకొచ్చాడు. 

లైబీరియా జెండాతో నమోదైన చమురు ట్యాంకర్ 'Shenlong ముంబై పోర్టు సమీపంలోని భారత జలాల్లోకి ప్రవేశించింది. ఈ నౌకకు భారతీయ కెప్టెన్ నాయకత్వం వహిస్తున్నాడు. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్టు నుంచి ముడి చమురుతో బయలుదేరిన ఈ ట్యాంకర్ సురక్షితంగా భారత జలాలకు చేరుకుంది. సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఈ నౌక సురక్షితంగా ప్రయాణం పూర్తి చేసి ముంబై పోర్టు వైపు చేరుకోవడం ముఖ్యంగా భావించారు.

అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ నౌకాదళం ఏర్పాటు చేసిన భద్రతా వలయాన్ని ఒక భారతీయ నావికుడు ఛేదించుకుని  మరీ అక్కడ నుంచి దాటి యావత్‌ ప్రపంచాన్ని ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  ఇప్పుడు ఈ టాపిక్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

అర్థరాత్రి చీకట్లో, తన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కనపెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి ముంబై తీరానికి చేరిన ఆ రహస్య నౌకకు సంబంధించి కొన్ని వివరాలు చూద్దాం. 

ఇరాన్ - ఒమన్ మధ్య ఉన్న హెూర్ముజ్ జలసంధి చాలా ముఖ్యమైన సముద్ర మార్గం, ఇది ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20% వాటాను కలిగి ఉంది. కేవలం 33 మైళ్ల వెడల్పు గల ఈ ఇరుకైన జలమార్గం పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ లను కలుపుతుంది. సౌదీ అరేబియా , ఇరాక్ వంటి దేశాల నుండి ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురు ప్రపంచానికి రవాణా చేయబడుతుంది. 

ముంబైలో ఓడ నిలిచిపోయింది
అయితే, ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్షుడు ఘోమెద్ హత్య జరిగిన తర్వాత, నిరసనగా మార్చి 2 నుండి హెూర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ఆకస్మికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఎరువులు, ఆహార ఉత్పత్తుల కొరతకు దారితీసింది. ఎందుకింత? మందుల కొరత కూడా ఏర్పడింది. అప్పుడు చైనా నౌకలను మాత్రమే అనుమతించింది. 

అంతా డార్క్‌ మోడ్‌..
అటువంటి క్లిష్ట పరిస్థితిలో షెన్లాంగ్ ఓడ ఇరాన్ దిగ్బంధనాలను ఛేదించుకుని ముంబై ఓడరేవుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక భారతీయ నావికుడు ఈ లైబీరియన్ నౌకను చాకచక్యంగా నడుపుతున్నాడు. ఇరాన్ నావికాదళం యొక్క నిఘా నుండి తప్పించుకోవడానికి, అతను నౌక యొక్క ఏఐఎస్ (ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్)ను నిలిపివేశాడు. అంతేకాకుండా, వారు అర్థరాత్రి నౌకలోని లైట్లన్నింటినీ ఆపివేసి, పూర్తి చీకటిలో ఈ ప్రమాదకరమైన కాలువను దాటారు. “డార్క్ మోడ్” (సిగ్నల్ ఆఫ్ చేసి) నడిపి ముంబై పోర్టుకు సురక్షితంగా చేర్చాడు.

శభాష్‌ భారత నావికుడా..
 ఈ భారీ ఓడ నుండి చమురు బ్యారెళ్లను ముంబైలో దించడానికి దాదాపు 38 గంటల సమయం పట్టింది. భారత నావికుడి ఈ ధైర్యసాహసాలు ఇరాన్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. కానీ, ఈ అర్థరాత్రి సంఘటనను మనం తిరిగి చూసుకున్నప్పుడు, ఇది అంతర్జాతీయ సముద్ర భద్రతలో భారతీయ నావికుల ధైర్యాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పినట్లుగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement