breaking news
Indian sailor
-
షాకింగ్ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!
వెనిజులాలో గత మే నెలలో గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్న భారతీయ నావికుడి (సీఫేరర్) 33 ఏళ్ల రాకేష్ చౌహాన్ అనుమానాస్పద మరణంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ అమెరికా దేశం నుండి స్వదేశానికి తీసుకువచ్చిన రాకేష్ చౌహాన్ కుటుంబ సభ్యులు అతని మృతదేహంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులతో సహా పలు అంతర్గత అవయవాలు మాయమయ్యాయని ఆరోపించారు. కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు భారతదేశంల నిర్వహించిన రీ-పోస్ట్‌మార్టం (Re-autopsy) నివేదికలో వెల్లడైన విషయాలు దిగ్భ్రాంతి రేపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాకేష్ మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని 'ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్స్ ఆఫ్ ఇండియా' (FSUI) డిమాండ్ చేసింది. ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, వెనిజులా అధికారులు ఎలాంటి పోస్ట్‌మార్టం నివేదిక లేదా వివరాలు ఇవ్వకుండానే రాకేష్ భౌతికకాయాన్ని యూపీలోని డియోరియాలోని అతని స్వగ్రామానికి పంపించారని FSUI పేర్కొంది.The family of late Indian seafarer #RakeshChauhan is demanding the full autopsy report and immediate clarification on several deeply disturbing irregularities in the handling of his case in Venezuela.Serious questions that need answers:• Why were vital organs removed from his… pic.twitter.com/9sfCm5kb9A— FSUI (@FSUIINDIA) July 1, 2026 FSUI పోస్ట్ ప్రకారం మృతదేహంలో ఒక్క అవయవం కూడా లేదు. మెదడు, గుండె, రెండు ఊపిరితిత్తులు, కాలేయం (లివర్), మూత్రపిండాలు (కిడ్నీలు), ప్లీహం (స్లీన్), క్లోమం (పాంక్రియాస్), ప్యాంక్రియాస్, కడుపు, ప్రేగులు... ఇలా అన్నీ మాయ మయ్యాయి. అలాగే థైరాయిడ్, హయాడ్ ఎముక, లారింక్స్, శ్వాసనాళం కూడా లేవు. మృతదేహంపై గతంలోనే భారీగా కుట్లు వేసి ఉన్నాయి. మెడ నుండి ప్యూబిక్ సింఫిసిస్ వరకు 22 కుట్లు, ఒక చెవి నుండి మరో చెవి వరకు 21 కుట్లు ఉన్నాయి. మరణానికి ముందు జరిగిన గాయాల గుర్తులేవీ లేవు. మృతదేహాన్ని దాదాపు నెల రోజుల పాటు డీప్ ఫ్రీజర్‌లో ఉంచారు. శరీరంలో ఎలాంటి అవయవాలు లేకపోవడం వల్ల మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేక పోయారు.ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. సముద్రయాన కార్మికులు బలిపశువులుగా మారుతున్నారు. వెనిజులా అధికారుల నుండి పూర్తి విచారణ, జవాబుదారీతనం, వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే జోక్యం చేసుకొని, పూర్తి శవ పరీక్ష నివేదిక, మరణానికి గల కారణాలు, కుటుంబానికి న్యాయంతో పాటు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసింది. విదేశాల్లో భారతీయ కార్మికులను చూసే విధానం, పారదర్శకత, విదేశీ అధికారుల బాధ్యతలపై ఈ ఘటన అనేక తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తుతోందని నావికుడి కుటుంబ సభ్యులు, సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: అయోధ్య విరాళాల స్కామ్ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చుకాగా యూపీలోని డియోరియా, లగ్దా బజార్ టోలా నివాసి అయిన చౌహాన్, నవంబర్ 2025లో ఒక వాణిజ్య నౌకాదళ నౌక సిబ్బందిలో భాగంగా వెనిజులాకు వెళ్లారు. రాకేష్‌ను ఆ నౌకలో పంపిన సంస్థ ఎక్స్ఫినిటీ. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం నౌకపై పడిన రాకేష్ గాయపడ్డారని చికిత్స పొందుతున్నారని తొలుత సమాచారం అందించిన కంపెనీ అధికారులు,ఆ మరుసటి రోజు ఉదయం, చౌహాన్ బతికే అవకాశాలు 95 శాతం లేవని, సాయంత్రానికి ఆయన మరణాన్ని ధృవీకరించింది. కారణాలపై వారు ఆరా తీయగా, కింద పడటం వల్ల కలిగిన తీవ్ర గాయాల కారణంగానే చనిపోయారని కంపెనీ పేర్కొంది. అలాగే వారంరోజుల్లో మృతదేహాన్ని అప్పగిస్తామన్న కంపెనీ దాదాపు ఒక నెల తర్వాత, అంటే జూన్ 4న మృతదేహాన్ని అప్పగించింది.ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్ -
రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు
రష్యా నుంచి భారతదేశానికి వస్తూ ఇంగ్లీష్ ఛానెల్‌ను దాటుతున్న షాడో- ప్లీట్ అనే ఆయిల్ ట్యాంకర్‌ను బ్రిటన్ అధికారులు అడ్డుకున్నారు. ఆ నౌక కెప్టెన్‌నైనా అజయ్ పంత్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో ఆ కెప్టెన్ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా ఆయనను విడిపియ్యాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు."రష్యా (ఆంక్షలు) నిబంధనలు 2019" లోని 'రెగ్యులేషన్ 46Z9B' ని ఉల్లంఘిస్తూ.. రష్యా చమురును ఇతర దేశానికి ఓడ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సరఫరా చేసినట్లు ఆయనపై కేసు నమోదు చేశారు.అయితే ఆయన తరపున కేసు వాదించిన "ఈ నౌక ఎక్కడికి వెళ్లాలి, ఎలాంటి సరుకును తీసుకెళ్లాలి అనేది ఆయన నిర్ణయం కాదు. ఆయన కేవలం కార్పొరేషన్ (కంపెనీ) ఆదేశాలను మాత్రమే పాటించారు. ఆయన తన ఉద్యోగాన్ని చేసుకుంటున్న ఒక ఉద్యోగి మాత్రమే, ఇప్పుడు బ్రిటీష్ కోర్టు ముందు నిలబడాల్సి వచ్చింది" అని పేర్కొన్నారు.ఇరు వాదనలు విన్న అక్కడి కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేసింది.భార్య ఆవేదనఅజయ్ పంత్ భార్య.. రీతు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో బ్రిటీష్ మీడియా నివేదికల ద్వారానే తన భర్త అరెస్ట్ విషయం తెలిసింది. UK లేదా భారత అధికారుల నుండి తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని చెప్పారు. ఆయన కేవలం కంపెనీ ఆదేశాల మేరకే నౌకను నడిపారని, ఇందులో ఆయన తప్పేమీ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం స్పందనదీనిపై ఉత్తరాఖండ్ హోం సెక్రటరీ శైలేష్ బగౌలీ స్పందిస్తూ.. పంత్ విడుదల మరియు పునరాగమనం కోసం సహాయం చేయాలని కోరుతూ రెండు రోజుల క్రితమే భారత విదేశాంగ శాఖ కు లేఖ రాశామని తెలిపారు. ఢిల్లీలోని తమ ప్రాంతీయ కమిషనర్ కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారని చెప్పారు. కాగా UKలోని భారత హైకమిషన్‌కు పంత్‌ను కలుసుకునేందుకు అనుమతి లభించింది..కాగా బ్రిటన్ చరిత్రలో ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే మొదటిసారి. రాయల్ మెరైన్ కమాండోలు రాత్రి వేళల్లో 'చినూక్' హెలికాప్టర్ ద్వారా నౌకపైకి దిగారు. నేషనల్ క్రైమ్ ఏజెన్సీ అధికారులు నౌకలోని పత్రాలను తనిఖీ చేశారు. బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ ఆపరేషన్‌ను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని చెబుతూ, ఇది "రష్యాకు తగిలిన మరో దెబ్బ" అని అభివర్ణించారు. -
భారతీయ నౌకపై దాడి.. 24 మంది నావికులు..!
టెహ్రాన్: హర్ముజ్‌లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు (సోమవారం) ఒమన్ తీర సమీపంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడి జరిగింది. దీంతో భారత వాయుసేన తక్షణమే స్పందించి అందులోని నావికులను రక్షించింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.ఒమన్ తీర సమీపంలో 'ఎంటి మారివెక్స్'అనే ఆయిల్ సరఫరా చేస్తున్న నౌకలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో 24మంది నావికులు ఉన్నారు. దీంతో హుటాహుటీన స్పందించిన నావిక దళం వారందరినీ హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈ దాడి ఎవరూ చేశారని సమాచారం ఇంకా తెలియలేదు. కాగా ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తకరంగా మారాయి. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్ఫరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో సహా పలు ప్రాంతాలలో భారీగా పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ మాటలు లెక్కచేయకుండా ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకపడింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.Helicopter rescue operation underway for 24 Indian seafarers after vessel Marivex was struck off the coast of OmanFootage from the scene show the crew being lifted from the damaged vessel after fighting for survival at sea pic.twitter.com/crlSDYaU6y— RT (@RT_com) June 8, 2026 -
హార్మూజ్ తరంగాలపై భారత నావికుడి సాహసం..!
ఇది భారత నావికుడి సాహసం.. ఒకవైపు భీకర యుద్ధం. మరొకవైపు ఓ నౌక హార్మూజ్ జలసంధిని దాటిన వైనం. అయితే భారత నావికుడు అత్యంత ధైర్య సాహసాలతో దాన్ని హార్మూజ్ జలసంధి దాటించడమే కాదు.. భారత్‌కు తీసుకొచ్చాడు. లైబీరియా జెండాతో నమోదైన చమురు ట్యాంకర్ 'Shenlong ముంబై పోర్టు సమీపంలోని భారత జలాల్లోకి ప్రవేశించింది. ఈ నౌకకు భారతీయ కెప్టెన్ నాయకత్వం వహిస్తున్నాడు. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్టు నుంచి ముడి చమురుతో బయలుదేరిన ఈ ట్యాంకర్ సురక్షితంగా భారత జలాలకు చేరుకుంది. సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఈ నౌక సురక్షితంగా ప్రయాణం పూర్తి చేసి ముంబై పోర్టు వైపు చేరుకోవడం ముఖ్యంగా భావించారు.అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ నౌకాదళం ఏర్పాటు చేసిన భద్రతా వలయాన్ని ఒక భారతీయ నావికుడు ఛేదించుకుని మరీ అక్కడ నుంచి దాటి యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అర్థరాత్రి చీకట్లో, తన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కనపెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి ముంబై తీరానికి చేరిన ఆ రహస్య నౌకకు సంబంధించి కొన్ని వివరాలు చూద్దాం. ఇరాన్ - ఒమన్ మధ్య ఉన్న హెూర్ముజ్ జలసంధి చాలా ముఖ్యమైన సముద్ర మార్గం, ఇది ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20% వాటాను కలిగి ఉంది. కేవలం 33 మైళ్ల వెడల్పు గల ఈ ఇరుకైన జలమార్గం పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ లను కలుపుతుంది. సౌదీ అరేబియా , ఇరాక్ వంటి దేశాల నుండి ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురు ప్రపంచానికి రవాణా చేయబడుతుంది. ముంబైలో ఓడ నిలిచిపోయిందిఅయితే, ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్షుడు ఘోమెద్ హత్య జరిగిన తర్వాత, నిరసనగా మార్చి 2 నుండి హెూర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ఆకస్మికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఎరువులు, ఆహార ఉత్పత్తుల కొరతకు దారితీసింది. ఎందుకింత? మందుల కొరత కూడా ఏర్పడింది. అప్పుడు చైనా నౌకలను మాత్రమే అనుమతించింది. అంతా డార్క్ మోడ్..అటువంటి క్లిష్ట పరిస్థితిలో షెన్లాంగ్ ఓడ ఇరాన్ దిగ్బంధనాలను ఛేదించుకుని ముంబై ఓడరేవుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక భారతీయ నావికుడు ఈ లైబీరియన్ నౌకను చాకచక్యంగా నడుపుతున్నాడు. ఇరాన్ నావికాదళం యొక్క నిఘా నుండి తప్పించుకోవడానికి, అతను నౌక యొక్క ఏఐఎస్ (ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్)ను నిలిపివేశాడు. అంతేకాకుండా, వారు అర్థరాత్రి నౌకలోని లైట్లన్నింటినీ ఆపివేసి, పూర్తి చీకటిలో ఈ ప్రమాదకరమైన కాలువను దాటారు. “డార్క్ మోడ్” (సిగ్నల్ ఆఫ్ చేసి) నడిపి ముంబై పోర్టుకు సురక్షితంగా చేర్చాడు.శభాష్ భారత నావికుడా.. ఈ భారీ ఓడ నుండి చమురు బ్యారెళ్లను ముంబైలో దించడానికి దాదాపు 38 గంటల సమయం పట్టింది. భారత నావికుడి ఈ ధైర్యసాహసాలు ఇరాన్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. కానీ, ఈ అర్థరాత్రి సంఘటనను మనం తిరిగి చూసుకున్నప్పుడు, ఇది అంతర్జాతీయ సముద్ర భద్రతలో భారతీయ నావికుల ధైర్యాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పినట్లుగా ఉంది. -
ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు..!
‘నైజీరియన్ నౌకాదళం నన్ను తీసుకెళ్తోంది. ఇదే నా చివరి సందేశం కావొచ్చు. మీరంతా నాకు సాయం చేస్తారని భావిస్తున్నా..’ అంటూ ఇక్వెటోరియల్ గినీలో బందీగా మారిన ఓ భారత నావికుడి వీడియో సందేశం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆఫ్రికా దేశమైన ఇక్వెటోరియల్ గినీలో గత ఆగస్టు నెలలో ‘హీరోయిక్ ఇడున్’ అనే నౌకను అక్కడి నౌకాదళం బందించింది. అందులోని 16 మంది భారత నావికులు సహా సిబ్బంది బందీలుగా ఉన్నారు. ఆగస్టు 13న హీరోయిక్ ఇడున్ నౌకపై ఇక్వెటోరియల్ గినియా జెండా లేదనే కారణంగా నిలిపేశారు. గత 80 రోజులుగా నావికులు బందీలుగా ఉన్నారని, వారిని నైజీరియా నేవీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హీరోయిక్ ఇడున్ నౌక చీఫ్ ఆఫీసర్, భారత నావికుడు సాను జోష్ తనను అదుపులోకి తీసుకునేందుకు కొన్ని క్షణాల ముందు తీసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోలో ‘నైజీరియాన్ నౌకాదళం నన్ను తీసుకెళ్తోంది. ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు. మీరంతా నన్ను చూస్తున్నారని, నాకు సాయం చేస్తారని భావిస్తున్నా. ఈ సందేశాన్ని దేశంలోని ప్రతిఒక్కరికి చేరేలా చేస్తారని ఆశిస్తున్నా.’ అని పేర్కొన్నారు సాను జోష్. బందీలుగా మారిన భారత నావికులను విడిపించేందుకు భారత అధికారులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సిబ్బంది సురక్షితంగా స్వదేశం చేరేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు.. గత ఆగస్టు నెల మధ్యలోనే హీరోయిక్ ఇడున్ అనే నౌకకు చెందిన భారత నావికులు సహా సిబ్బంది అంతా బందీలుగా పట్టుబడ్డారని విదేశాంగ శాఖకు తెలియజేశారు రాజ్యసభ సభ్యుడు ఏఏ రహీం. మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బందీలను త్వరగా విడుదల చేయడానికి గినీ, నైజీరియా దేశాలకు చెందిన అధికారులతో చర్చిస్తున్నామని ఇక్వెటోరియల్ గినీలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇదీ చదవండి: ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. ఆందోళనలో ప్రజలు.. చైనానే కారణం?


