ఒమిక్రాన్‌ వైరస్‌ ఈ నగరాన్ని దెయ్యాల నగరంగా మారుస్తోంది!!

Omicron Surge Is Turning London Into A Ghost Town - Sakshi

Omicron Wave Is Turning This City Into A Ghost Town: లండన్‌ వీధులన్ని క్రిస్మస్‌ వేళ షాపింగ్‌ మాల్‌లు, రెస్టారెంట్‌లు , పబ్‌లు కస్టమర్‌ల ఆర్డర్‌లతో కళకళలాడుతుంటాయి. అంతేకాదు లండన్‌లోని ప్రముఖ నగరాల వీధులన్ని ప్రజల కేరింతలతో సందడి చేస్తుంటాయి. కానీ ఈ ఒమిక్రాన్‌ దెబ్బకు లండన్‌లోని వీధులన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. ఒక వైపు రోజు రోజుకి పెరుగుతున్న కేసుల సంఖ్య, మరోవైపు . దేశాధినేతలు, వైద్యాధికారులు ప్రజల ఆరోగ్య దృష్ట్య  జారీ చేస్తున్న కఠినమైన కరోనా ఆంక్షల నేపథ్యంలో లండన్‌ ఘోస్ట్‌ నగరాన్ని తలిపించేలా నిశబ్దంగా మారిపోయింది.

దక్షిణ లండన్‌లోని పార్లెజ్ అనే పబ్  రెస్టారెంట్ యజమానులు వచ్చే క్రిస్మస్ పండుగక అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని ఎన్నో ఆశాలతో ఎదురు చూశాం అని అంటున్నారు. అంతేకాదు ఇప్పుడుప్పుడే ఈ కోవిడ్-19 లాక్‌డౌన్‌ల నుంచి నెమ్మదిగా పుంజుకుంటుందని భావించాం అని చెప్పారు. కానీ అనుహ్యంగా  ఈ దక్షిణాఫ్రికా ఒమిక్రాన్‌ వైరస్‌ తమ ఆశలను అడియాశాలు చేసిందంటూ రెస్టారెంట్‌ పబ్‌ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

(చదవండి: ప్రధాని మోదీకి భూటాన్‌ అత్యున్నత పురస్కారం)

అంతేకాదు ఈ వారంలో లండన్‌లో కేసులు సంఖ్య పెరుగుతున్నాయని, వైద్యులు, నర్సులు అనారోగ్యానికి గురవుతున్నారని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టి హెచ్చరించారు. ఈ మేరకు లండన్‌లోని సదరు కంపెనీలు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోంతో ఇళ్ల వద్ద నుంచి పనిచేయండి అని చెప్పడంతో  లండన్‌ వీధులన్ని నిర్మానుష్యమై పోయాయి. పైగా కఠినమైన కోవిడ్‌ ఆంక్షలు విధించడంతో డ్రింక్‌ చేయడానికి కూడా ఎవరూ పెద్దగా బయటకు రావడం లేదు.  దీంతో లండన్‌ ప్రముఖ రెస్టారెంట్‌లు, పబ్‌లు ఆర్థికంగా దారుణంగా దెబ్బతిన్నాయి.

గత కొన్నాళ్లుగా బ్రిటన్‌ ఆతిధ్య వ్యాపారాలన్ని చాలా కోలుకోలేనంత దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే లాక్‌ డౌన్‌ల​ తదనంతరం కోలుకోవడానికి నెమ్మదిగా ప్రయత్నిస్తుండగా ఈ ఒమిక్రాన్‌ మళ్లీ మరింతగా ఆ వ్యాపారాలన్నింటిని దెబ్బతీసింది. యూకే రాజధానిలో ఎక్కువగా ఉన్న 43 రెస్టారెంట్లు, బార్‌లు, హోటళ్ల  ఆదాయాలు గణనీయంగా తగ్గడం చాలా ఆందోళన కలిగించే విషయం అని లండన్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్ డెస్ గుణవర్దన్‌ అన్నారు.

ఈ మేరకు ప్రధాని బోరిస్ జాన్సన్ ఓమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి పటిష్టమైన కోవిడ్ చర్యలు అవసరమని క్రిస్మస్‌ సందర్భంగా ముందుగానే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టి  హెచ్చరికల నేపథ్యంలో లండన్‌లోని వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. అయితే ఈ ఆతిధ్య వ్యాపారాలకు ప్రభుత్వ సహాయం లేకపోడం పెద్ద అవరోధంగా ఉందంటూ బ్రిటీష్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రూబీ మెక్‌గ్రెగర్-స్మిత్ ఆందోళన వ్యక్తం చేశారు.

(చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top