
PM Modi Conferred With Bhutan's Highest Civilian Award: భారత ప్రధాని మోదీకి భూటాన్ దేశం నుంచి అరుదైన గౌరవం లభించింది. భూటాన్ దేశం తమ దేశ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని అత్యున్నత పౌర పురస్కారం నాడగ్ పెల్ గి ఖోర్లోతో సత్కరించింది. ఈ క్రమంలో భూటాన్ ప్రధాన మంత్రి లోటే షెరింగ్ అత్యున్నత గౌరవ పౌర పురస్కారం అయిన న్గదాగ్ పెల్ గి ఖోర్లోతో నరేంద్ర మోడీని సత్కరించడం తమకు చాలా సంతోషంగా అనిపించిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
అంతేకాదు గత కొన్నేళ్లుగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో మోదీజీ తమకు అందించిన స్నేహపూర్వక సహాయసహకారాలు, మద్దతును గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పైగా భూటాన్ ప్రజలు మోదీజీని గొప్ప ఆధ్యాత్మిక మహోన్నత వ్యక్తిగా భావిస్తున్నారని అన్నారు. ఈ మేరకు తాము ఈ అత్యున్నత పురస్కార వేడుకను వైభవోపేతంగా జరుపుకోవాలని భావిస్తూ భారత ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నాం అని భూటాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఫేస్‌బుక్‌లో పేర్కొంది.
(చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!)