సాహిత్యంలో నోబెల్‌ బహుమతి అందుకున్న అబ్దుల్‌ రజాక్‌ గుర్నా

Novelist Abdulrazak Gurnah Wins 2021 Nobel Prize in Literature - Sakshi

స్టాక్‌హోమ్‌: సాహిత్యంలో ఈ ఏడాదికి గాను టాంజేనియా నవలా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నాను నోబెల్‌ బహుమతి వరించింది. వలసవాదంపై ఆయన రాజీలేని పోరాటంతో పాటు, శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకుగానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది. 
(చదవండి: 2021 నోబెల్‌ బహుమతి: వైద్యరంగంలో ఇద్దరికి పురస్కారం)

అబ్దుల్‌ రజాక్‌ గుర్నా.. 1948లో హిందూ మహాసముద్రంలోని జాంజిబర్‌ ద్వీపంలో జన్మించారు. కానీ 1960 చివర్లో శరణార్థిగా ఇంగ్లాండ్‌ వలసవెళ్లారు. ప్రస్తుతం ఆయన కేంట్రబెరీలోని కెంట్‌ యూనివర్శిటీలో సాహిత్య ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక 21వ ఏట నుంచే రచనలు ప్రారంభించారు రజాక్‌. ఇప్పటివరకు 10 నవలలు, ఎన్నో చిన్న కథలు రచించారు. 2005లో రజాక్‌ రాసిన ‘డిసర్షన్‌’ నవల అప్పట్లో సంచలనం సృష్టించింది. 

చదవండి: వాతావరణంపై పరిశోధనలకు పట్టం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top