కొత్త చట్టం.. ప్రపంచంలోనే తొలి దేశంగా న్యూజిలాండ్‌

New Zealand Will Make Banks Report Climate Impact To Passed A Law - Sakshi

వెల్లింగ్టన్‌: బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెట్టుబడి సంస్థలు వచ్చే ఏడాది నుండి తమ పోర్ట్‌ఫోలియోల గ్లోబల్ వార్మింగ్ రికార్డు వెల్లడించేలా న్యూజిలాండ్‌ ఒక చట్టాన్ని ఆమోదించింది. అంతేకాదు ఇది ఆర్థిక రంగంలో పర్యావవరణ రికార్డును మరింత పారదర్శకం చేసే ప్రథమ చర్యగా అభివర్ణించింది.ఫలితంగా ఈ చట్టాన్ని రూపొందించిన తొలి దేశంగా న్యూజిలాండ్‌ నిలిచింది. 

(చదవండి: శత్రు ట్యాంకులను ఎలా నాశనం చేస్తామంటే!)

ఈ  మేరకు న్యూజిలాండ్‌ వాతావరణ మార్పుల మంత్రి జేమ్స్ షా మాట్లాడుతూ..."బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెట్టుబడి సంస్థలు వచ్చే ఏడాది నుండి తమ పోర్ట్‌ఫోలియోల గ్లోబల్ వార్మింగ్ రికార్డు గురించి తప్పనిసరిగా వెల్లడిస్తాయి." అని చెప్పారు. ఈ నెలాఖరున ఐక్యరాజ్యసమితి గ్లాస్గోలో నిర్వహించినున్న వాతావరణ సదస్సలో  షా పాల్గోననున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఈ  విధంగా ప్రకటించటం ఒకరకంగా  పెట్టుబడి రంగం వాస్తవ ప్రపంచ పరిణామాలను తెలియజేయ గలవు అనే విషయాన్ని ప్రపంచదేశాలకి నొక్కి చెప్పగలం అన్నారు.

అంతేకాదు వాతావరణ మార్పులకు సంబంధించి స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలిక ప్రభావాలను వారి వ్యాపార నిర్ణయాలలోకి చేర్చడం ద్వారా సంస్థలు మరింత స్థిరంగా మారడానికి ఇది ప్రోత్సహకరంగా ఉంటుందన్నారు. ప్రపంచ అగ్రగామి ఉన్న న్యూజిల్యాండ్‌  ఆర్థిక రంగం కోసం తప్పనిసరిగా వాతావరణ సంబంధిత రిపోర్టింగ్‌ను ప్రవేశపెట్టి ప్రపంచంలోనే తొలి దేశంగా నిలిచిందని చెప్పారు.

(చదవండి: మొసలిని తిప్పితిప్పి తుక్కుతుక్కు చేసింది..!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top