నలుగురికి కోవిడ్‌ పాజిటివ్‌.. భారత పర్యాటకులపై నేపాల్‌ నిషేధం 

Nepal Bars Entry Of Indians After Four Tourists Test Covid Positive - Sakshi

కఠ్మాండూ: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో పొరుగుదేశం నేపాల్ అప్రమత్తమైంది భారత్‌ నుంచి వచ్చే పర్యాటకులు తమ దేశంలోకి ప్రవేశించకుండా నేపాల్‌ నిషేధం విధించింది. ఇటీవల ఝులాఘాట్ సరిహద్దు ప్రాంతం మీదుగా భారత్‌ నుంచి బైతడి జిల్లాకు వచ్చిన నలుగురు భారతీయ పర్యాటకులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణయిందని అధికారులు తెలిపారు. వారిని వెంటనే తిరిగి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించామన్నారు.

భారత్‌ నుంచి తిరిగి వచ్చే నేపాలీయుల కారణంగా కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున పర్యాటకులపై నిషేధం విధించామన్నారు. మంగళవారం ఒక్కరోజే నేపాల్‌లో వెయ్యికి పైగా కేసులు  నమోదయ్యాయి.  మరోవైపు టిబెట్‌లో కేసులు పెరుగుతుండడంతో బౌద్ధ నేతల సంప్రదాయ గృహమైన పోటాలా సౌధాన్ని మంగళవారం నుంచి మూసివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. కాగా చైనాలో నిన్న 828 కొత్త కేసులు బయటపడగా అందులో టిబెట్‌లో 22 నమోదయ్యాయి.
చదవండి: ఆగని ఇజ్రాయెల్‌ దాడులు.. వెస్ట్‌బ్యాంక్‌లో ముగ్గురు మృతి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top