Russia-Covid 19: రష్యాలో కరోనా విస్ఫోటం.. ఒక్క రోజులోనే..

Moscow starts nonworking period as COVID-19 infections - Sakshi

ఒక్క రోజులో 40,096 పాజిటివ్‌ కేసులు

మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది.  గురువారం ఒక్కరోజే 40,096 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 1,159 మంది కరోనా కాటుకు బలయ్యారు. దేశంలో రోజువారీ కేసులు, మరణాల్లో ఇప్పటిదాకా ఇవే అత్యధికం. వైరస్‌ ఉధృతిని అరికట్టడానికి  జనమంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది.

రాజధాని మాస్కోలో గురువారం నుంచి నాన్‌ వర్కింగ్‌ పీరియడ్‌ (అత్యవసర విధుల్లో ఉన్నవారు మినహాయించి ఇతర ఉద్యోగులు ఎవరూ విధులకు హాజరు కాకూడదు) ప్రారంభమయ్యింది. రష్యాలో కరోనాతో ఇప్పటిదాకా 2,35,057 మంది మృతిచెందారు. ఒకవైపు కరోనా వ్యాప్తి పెరుగుతున్నా మరోవైపు జనం నిర్లక్ష్యం వీడడం లేదు. రష్యా నుంచి ఈజిఫ్టు, టర్కీకి ప్యాకేజీ టూర్ల సంఖ్య భారీగా పెరిగింది. రష్యాలో 14.6 కోట్ల జనాభా ఉండగా, ఇప్పటిదాకా4.9 కోట్ల మంది మాత్రమే టీకా రెండు డోసులు తీసుకున్నారు.
(చదవండి: సెనోలిటిక్స్‌.. వయసుపై యుద్ధం!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top