అలాంటి చోట చాలా అసహ్యంగా మాట్లాడారు.. కష్టంగా అనిపించింది: అందాల సుందరి ఆవేదన

Miss Russia Sensational Comments On Miss Universe Pageant - Sakshi

తాజా విశ్వ సుందరి పోటీలపై సంచలన ఆరోపణలు చేసింది మిస్‌ రష్యా అన్నా లిన్నికోవా. ఆరోగ్యవంతమైన పోటీల వేదికగా పేరున్న మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో.. తాను దారుణమైన అనుభవాల్ని ఎదుర్కొన్నారని పేర్కొన్నారామె. అమెరికా, ఉక్రెయిన్‌ అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారన్న ఆమె.. తోటి పోటీదారుల నుంచి తీవ్ర వ్యతిరేకతను తాను ఎదుర్కొవాల్సి వచ్చిందని తాజాగా ఆరోపించారు. 

మిస్‌ యూనివర్స్‌ 2023 పోటీలు అమెరికాలో జనవరి 15వ తేదీతో ముగిశాయి.  అయితే.. పోటీలో తనను చిన్నచూపు చూశారని రష్యన్‌ అందాల సుందరి ఆరోపిస్తోంది. తన దేశ మీడియా సంస్థ ఈవెనింగ్‌ మాస్కోకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. 

తెలిసిన వాళ్లే నన్ను దూరం పెట్టారు. పోటీలు మొదలయినప్పటి నుంచే నన్ను అవమానిస్తూ.. బెదిరిస్తూ ఉక్రెయిన్‌ సోషల్‌ మీడియా యూజర్లు కామెంట్లు చేశారు. చాలా అసహ్యంగా మాట్లాడారు.  ప్రత్యేకించి.. చాలాకాలంగా పరిచయం ఉన్నవాళ్లు కూడా నాపై నెగెటివ్‌ కామెంట్లు చేశారు. అది చాలా కష్టంగా అనిపించిందని పేర్కొన్నారామె. 

రష్యా పౌరురాలిని కావడంతో కొందరైతే.. దూరంగా ఉన్నారని, ఇష్టానుసారం మాట్లాడారని పేర్కొన్నారామె. ముఖ్యంగా ఉక్రెయిన్‌, స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చిన అమ్మాయిలైతే తనపై మండిపడ్డరాని పేర్కొందామె. అయితే.. అలాంటి సమయంలో వెనిజులా భామ అమండా డుడామెల్ తనతో ఆప్యాయంగా ఉంటూ.. పోటీల్లో అండగా నిలిచే యత్నం చేసిందని,  బహుశా ఆ మంచితనానికే ఆమె పోటీల్లో రెండో స్థానంలో నిలిచి ఉండొచ్చని అన్నా అభిప్రాయపడింది. 

ఉక్రెయిన్‌ సుందరి విక్టోరియా అపనాసెంకో గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారనంగానే ఆమె తనతో మాట్లాడకపోయి ఉండొచ్చని, అది ఎంతో బాధించిందని  మిస్‌ రష్యా అందాల సుందరి అన్నా లిన్నికోవా పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అన్నాకు ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top