నాసా ప్రయోగం; ఎవరీ స్వాతి మోహన్..?

Meet Swati Mohan, Indian American Leading NASA Operation Perseverance Rover Landing on Mars - Sakshi

కేప్‌ కెనవరెల్‌: అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చేపట్టిన తాజా ప్రయోగంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ స్వాతి మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘మార్స్‌ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్‌ కంట్రోల్స్‌(జీఎన్‌ అండ్‌ సీ)కి ఆమె ఆపరేషన్స్‌ లీడ్‌గా ఉన్నారు. అంతరిక్షం పట్ల చిన్ననాటి నుంచే అమితాసక్తి కలిగిన స్వాతి మోహన్..‌ భారత్‌ నుంచి ఏడాది వయసులో తన తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లారు. 

స్టార్‌ ట్రెక్‌ స్ఫూర్తితో.. 
నార్తర్న్‌ వర్జినియా, వాషింగ్టన్‌ డీసీల్లో ప్రాథమిక విద్యాభ్యాసం, కార్నెల్‌ యూనివర్సిటీలో మెకానికల్, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో బీఎస్‌ చేశారు. ఎంఐటీ నుంచి ఏరోనాటిక్స్‌/ఆస్ట్రోనాటిక్స్‌లో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఉద్యోగ విధుల్లో భాగంగా నాసాలో పలు ప్రాజెక్టుల్లో పాలు పంచుకున్నారు. కేసిని (శనిగ్రహం పైకి), గ్రెయిల్‌ (చంద్రుడిపైకి) ప్రయోగాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు.

ఈ ‘మార్స్‌ 2020’ ప్రయోగం 2013లో ప్రారంభమైనప్పటి నుంచి డాక్టర్‌ స్వాతి మోహన్‌ ఇందులో పాలుపంచుకుంటున్నారు. తొలిసారి టీవీలో ‘స్టార్‌ ట్రెక్‌’సిరీస్‌ చూసిన 9 ఏళ్ల వయసు నుంచే స్వాతిలో అంతరిక్షం పట్ల ఆసక్తి ప్రారంభమైంది. 

చదవండి:
అరుణ గ్రహంపై సక్సెస్‌ఫుల్‌గా ల్యాండైన ‘పెర్సి’

ఒక రూపాయికే పెట్రోలు.. ఎక్కడ?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top