Africa Fuel Tanker Blast: ఆయిల్‌ కోసం ఎగబడ్డ జనాలు.. ఒక్కసారిగా పేలుడు..

Massive Fuel Tanker Blast In Africa Sierra Leone Causes Deaths And Injuries - Sakshi

ఆఫ్రికాలో చోటు చేసుకున్న సంఘటన

సియర్రాలియోన్‌/ ఆఫ్రికా: ఆఫ్రికాలో దారుణం చోటు చేసుకుంది. ఆయిల్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో 91 మంది మృతి చెందారు. ఈ సంఘటన ఆఫ్రికా సియర్రాలియోన్‌లో శనివారం చోటు చేసుకుంది. సియర్రాలియోన్‌ రాజధాని ఫ్రీటౌన్‌లో ఈ పేలుడు సంభవించింది. ఆ వివరాలు.. ఆయిల్‌ ట్యాంకర్‌ నుంచి చమురు లీకవతుండటంతో దాన్ని పక్కనే ఉన్న గ్యాస్‌ స్టేషన్‌ వద్ద నిలిపి ఉంచారు. విషయం తెలిసిన స్థానికులు లీకవుతున్న చమురును పట్టుకునేందుకు గుంపులు గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. (చదవండి: భూమి కుంగడంతోనే ప్రమాదం)

ఇదే సమయంలో అటుగా వచ్చిన బస్సు.. ఆగి ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు స్థానికులు, బస్సు ప్రయాణికులు మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 91 మంది మృతి చెందినట్లు అధికారుల ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

చదవండి: రాత్రికి రాత్రే శ్మశానాలుగా మారిపోయాయి.. అసలేం జరిగింది?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top