breaking news
Sierra Leone
-
మేరా భారత్ మహాన్.. దేశభక్తి రగిలిస్తున్న స్టార్ హీరోలు
దేశ సరిహద్దుల్లో సైనికుల్లా, దేశంలో గూఢచారులుగా, ప్రభుత్వ నిఘా సంస్థల ప్రతినిధులుగా... ఇలా దేశం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాయి. ఇలా ‘మేరా భారత్ మహాన్’ అంటూ దేశభక్తిని చాటి చెప్పేలా కొందరు హీరోలు చేస్తున్న సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ప్రభాస్ ఫౌజి వెండితెరపై ప్రభాస్ తొలిసారిగా సైనికుడిగా కనిపించనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ఈ సినిమా మిలటరీ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని తెలిసింది. అలాగే కొంత లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలోని వార్ సన్నివేశాల్లో ప్రభాస్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు సూపర్‌గా ఉంటాయని, ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కొత్తగా మేకోవర్ అయ్యారని సమాచారం. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.డ్రాగన్‌లో దేశభక్తి హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇది ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అనే ప్రచారం సాగింది. కానీ ఇటీవల జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో వందేమాతరం అంటూ వందలమంది జూనియర్ ఆర్టిస్టులు చెబుతుంటే, ఓ భారీపాటను చిత్రీకరించారట. ‘వందేమాతరం’ అంటూ సాగే ఈపాట స్క్రీన్‌పై కనిపించే సమయంలో సూపర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. దీంతో ఈ ‘డ్రాగన్’ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలకు చెందిన సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టోవినో థామస్ విలన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ‘టైగర్ జిందా హై, ఏక్తా టైగర్, టైగర్ 3’ వంటి స్పై యాక్షన్ సినిమాల్లో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఆఫీసర్‌గా నటించి, మెప్పించారు సల్మాన్ ఖాన్. తాజాగా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్‌పాత్రలో నటించనున్నారు. 2020లో గాల్వాన్ లోయలో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో చిత్రాంగదా సింగ్ మరో లీడ్ రోల్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది.ప్రస్తుతం తాను పోషించే ఆర్మీ ఆఫీసర్‌పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డైలీ కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా కోసం లడఖ్‌లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశామని, గడ్డకట్టే చలిలో అక్కడ ఏడెనిమిది రోజులు లోయలో షూటింగ్ చేస్తామని, ఈ షెడ్యూల్‌ను తలచుకుంటే తనకు భయంగా ఉందని, కానీ తాను సిద్ధమౌతున్నానని సల్మాన్ ఖాన్ ఇటీవల ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా ప్రయాణం గురించి చె΄్పారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే వచ్చే రంజాన్‌కు విడుదల చేయాలని సల్మాన్ ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భజరంగీ భాయిజాన్ 2: పది సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ సినిమా మంచి ఎమోషనల్ థ్రిల్లర్‌గా విజయం సాధించింది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలు కూడా ఉన్నాయి. కాగా ‘భజరంగీ భాయిజాన్’ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నామని, వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ సందర్భంలో కబీర్ ఖాన్ పేర్కొన్నారు. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.మేజర్ షైతాన్ సింగ్ భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై చూపించేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ దర్శక–నటుడు ఫర్హాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. ఈ ఘటన ప్రధానాంశంగా బాలీవుడ్లో రూపొందుతున్న చిత్రం ‘120 బహాదుర్’.ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్‌గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమాను ప్రకటించారు. ‘‘1962లో జరిగిన ఇండియా–చైనా వార్‌లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన ‘రెజాంగ్ లా’ యుద్ధాన్ని ఈ ‘120 బహాదుర్’ చిత్రంలో ఆడియన్స్ చూడబోతున్నారు. ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే మరో కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్ అక్తర్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు.సైనికుడి వాగ్దానం సన్నీ డియోల్ హీరోగా నటించిన వార్ డ్రామా ‘బోర్డర్ (1997)’. 1971లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ రానుంది. ‘బోర్డర్’ సినిమాలో హీరోగా నటించిన సన్నీ డియోల్ ఈ ‘బోర్డర్ 2’లోనూ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సైనికుల వీరత్వం, ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్ ఇండియాలోని ప్రముఖ లొకేషన్స్‌తోపాటు కశ్మీర్‌లోనూ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం 27 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ పెద్ద వార్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రయూనిట్ ఈ ‘బోర్డర్ 2’ సినిమా గురించి ఓ సందర్భంలో పేర్కొంది. వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను జనవరి 23న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ ప్రకటించింది.ఆపరేషన్ ఖుక్రీ పాతిక సంవత్సరాల క్రితం వెస్ట్ ఆఫ్రికాలోని సియోర్రా లియోన్‌లో జరిగిన ఆపరేషన్ ఖుక్రీ సంఘటన ఆధారంగా ఓ సినిమా రానుంది. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) పీస్ కీపింగ్ మిషన్స్‌లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారత సైనికులు, అక్కడి రెబల్స్ ట్రాప్‌లో చిక్కుకుని, 75 రోజులపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్‌ను రాజ్ పాల్ పునియా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులు, రాజ్ పాల్ సాహసోపేతమైన నిర్ణయాలు వంటి అంశాల ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ అనే సినిమా రానుంది.‘ఆపరేషన్ ఖుక్రీ: ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రానుంది. మేజర్ జనరల్ రాజ్ పాల్ పునియా, దామిని పునియా ఈ పుస్తకాన్ని రాయగా, ఈ బుక్ హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్‌దీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ పుస్తకం ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ రానుంది. ఈ సినిమాలో మేజర్ రాజ్ పాల్ పునియాగా రణ్‌దీప్ హుడా నటిస్తారు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.స్వాతంత్య్రానికి పూర్వం... భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, లండన్‌లో ఉన్న భారత మేధావులు కొందరు తరచూ సమావేశం అయ్యేవారు. ఈ సమావేశంలో భారతదేశానికి స్వాతంత్య్రం రావాలంటే ఏం చేయాలి? అనే వ్యూహ రచనలు, ప్రణాళికలను సిద్ధం చేసేవారు. ఈ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. రామ్‌చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇటీవల ఈ సినిమా సెట్స్‌లో చిన్న ప్రమాదం జరగడంతో చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఊపందుకోనుంది. 2026 చివర్లో ‘ది ఇండియా హౌస్’ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ఆపరేషన్ సిందూర్ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన దేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన ఆధారంగా సినిమాలు తీసేందుకు కొందరు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని, కొంతమంది కొన్ని టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఆల్రెడీ ఉత్తమ్ నితిన్ ఓ సినిమాను ప్రకటించారు. కానీ ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన జరుగుతున్నప్పుడే ఆయన సినిమాను ప్రకటించడంతో కాస్త వివాదాస్పదమైంది. మరి... ఉత్తమ్ తాను ప్రకటించిన సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు ⇒ గూఢచారుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో కియారా అద్వానీ మరో కీలకపాత్రలో నటించారు. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇక ‘వార్ 2’తోపాటు ‘యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్’లో భాగంగా రూపొందిన మరో చిత్రం ‘ఆల్ఫా’. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆలియా భట్, శర్వారీ ఈ సినిమాలో స్పైపాత్రలు చేశారు. ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. ఇక కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తీ ద్వి పాత్రాభినయం చేశారు. ఎస్. లక్ష్మణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే మన తెలుగులో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి 2’. ఎస్. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు వామికా, ఇమ్రాన్ హష్మి ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇలా దేశభక్తిని చాటుకునే స్పై బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో రానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
ఆయిల్ కోసం ఎగబడ్డ జనాలు.. ఒక్కసారిగా పేలుడు.. 91 మంది మృతి
సియర్రాలియోన్/ ఆఫ్రికా: ఆఫ్రికాలో దారుణం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 91 మంది మృతి చెందారు. ఈ సంఘటన ఆఫ్రికా సియర్రాలియోన్‌లో శనివారం చోటు చేసుకుంది. సియర్రాలియోన్ రాజధాని ఫ్రీటౌన్‌లో ఈ పేలుడు సంభవించింది. ఆ వివరాలు.. ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు లీకవతుండటంతో దాన్ని పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ వద్ద నిలిపి ఉంచారు. విషయం తెలిసిన స్థానికులు లీకవుతున్న చమురును పట్టుకునేందుకు గుంపులు గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. (చదవండి: భూమి కుంగడంతోనే ప్రమాదం) ఇదే సమయంలో అటుగా వచ్చిన బస్సు.. ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు స్థానికులు, బస్సు ప్రయాణికులు మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 91 మంది మృతి చెందినట్లు అధికారుల ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చదవండి: రాత్రికి రాత్రే శ్మశానాలుగా మారిపోయాయి.. అసలేం జరిగింది? -
‘కొందరు మగాళ్లలో అయినా మార్పు వస్తుందేమో అని’
ప్రిటౌన్: పిల్లల్ని కనడం, పెంచడం వంటి పనులన్ని ఆడవారివే అని భావించే తండ్రులు నేటికి కొకొల్లలు. ప్రస్తుతం దంపతులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుండటంతో ఈ పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చింది. ఈ క్రమంలో సియెర్రా లియోన్‌కు చెందిన ఓ మంత్రి తండ్రులు నిర్వహించాల్సిన బాధ్యతల గురించి చాలా బాగా చెప్పి.. మరి కొందరు మగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ వివరాలు.. సియెర్రా లియోన్ విద్యా శాఖమంత్రి డేవిడ్ మొయినినా సెంగే పది నెలల తన కుమార్తెకు పాలు తాగిస్తూ జూమ్ మీటింగ్‌కు హాజరయ్యాడు. పాలు పట్టడం పూర్తయ్యాక బిడ్డను వీపుకు కట్టుకున్నాడు. మీటింగ్ పూర్తయ్యేంతవరకూ బిడ్డను అలానే ఉంచుకున్నాడు. ఈ క్రమంలో బిడ్డను వీపుకు కట్టుకున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశాడు డేవిడ్. అంతేకాక ‘ఇంటి నుంచి పని చేస్తున్నారా.. మీ లాస్ట్ జూమ్ కాల్‌కు మీరు ఎలా అటెండ్ అయ్యారు? నేను మాత్రం నా 10 నెలల బిడ్డకు పాలు పడుతూ మీటింగ్‌కు హాజరయ్యాను. తను పాలు తాగడం పూర్తయిన తర్వాత నా వీపుకు కట్టుకుని మిగతా మీటింగ్ పూర్తి చేశాను. ఈ ప్రజెంట్షన్ తనను నిద్ర పుచ్చింది. మీరు ఇంటి నుంచి ఎలా పని చేస్తున్నారో ప్రపంచానికి తెలపండి’ అంటూ ట్వీట్ చేశాడు డేవిడ్. Working from home? How did u join your last zoom call? As Minister, I started my last call feeding my 10 month old, then carried her on my back for the rest of the call. The presentations helped her sleep. I invite you to share with the world how you worked from home as a leader. pic.twitter.com/wrkDwu58B5 — David Moinina Sengeh (@dsengeh) April 28, 2020 దీని గురించి బీబీసీ డేవిడ్‌ను ప్రశ్నించగా.. ‘పశ్చిమ ఆఫ్రికా దేశంలో ఓ తండ్రి పిల్లలను ఇలా వీపుకు కట్టుకోవడం అనేది చాలా అరుదు. ఓ తల్లి బిడ్డను వీపున మోసుకెళ్లడం ఇక్కడ సర్వసాధరణంగా కనిపించే అంశం. ఇదే పని నా భార్య చేస్తే.. ఆ ఫోటో ఇంత వైరల్ అయ్యేది కాదు. నా స్నేహితుల్లో చాలా మంది వారి పిల్లలకు కనీసం డైపర్ కూడా మార్చరు. అలాంటి వారిలో మార్పు తేవడం కోసమే నేను ఈ ఫోటోను షేర్ చేశాను ’అని తెలిపాడు. -
రాజధానిపై వరద ప్రకోపం, 350 మంది మృతి
-
రాజధానిపై వరద ప్రకోపం, 312 మంది మృతి
ఫ్రీటౌన్: సియర్రా లియోన్ పేదరికంతో కొట్టుమిట్టాడే ఓ ఆఫ్రికన్ దేశం. దీని రాజధాని ఫ్రీటౌన్. దేశ ఆర్థిక ప్రగతి మొత్తం రాజధానిలోనే కేంద్రీకృతం కావడంతో దాదాపు 12 లక్షల మంది జనాభాతో ఫ్రీటౌన్ కిక్కిరిసి ఉంటుంది. అలాంటి నగరంపై ప్రకృతి తన ప్రకోపాన్ని చూపింది. చిక్కిపోయిన దేహాలతో ఉండే సగటు ఫ్రీటౌన్ వాసి ప్రాణాలను అరచేత పట్టుకుని, ఇళ్లను వదిలి కొండలను ఎక్కాల్సిన పరిస్థితిని కల్పించింది. సోమవారం ఫ్రీటౌన్పైకి దూసుకొచ్చిన రాకాసి వరద 312 మందిని పొట్టన పెట్టుకుంది. భారీ మొత్తంలో వచ్చిన వరద నీటితో పాటు పెద్ద ఎత్తున వచ్చిన ఎర్ర మట్టి ప్రజల పాలిట శాపంగా మారింది. ఒట్టి వరదైతే తప్పించుకోవడానికి కొంత సులువుగా ఉండేది. కానీ, నీటితో పాటు వచ్చిన మట్టి మనుషులను చుట్టేసి తనలో కలిపేసుకుంది. నగరంలోని ఏ వీధిని చూసిన నిశ్శబ్దం. కుప్పలు తెప్పలుగా పడివున్న శవాలు. వీటన్నింటిని చూసిన పత్రికా విలేకరికి కన్నీళ్లు ఆగలేదు. సగానికి పైగా తెగిపోయిన మనుషుల శరీరాల నుంచి బయటకు వస్తున్న ఎర్రమట్టి ఆయన్ను అక్కడే కూలబడిపోయేలా చేసింది. ఆ హృదయ విదారక సన్నివేశాలను కెమెరాలో బంధించి సోషల్‌మీడియాలో సాయం కోసం పోస్టు చేశారు. వేల సంఖ్యలో సహాయకులు అవసరమని ఫ్రీటౌన్ ప్రజలను కాపాడాలని అభ్యర్థించారు. వరద వల్ల దాదాపు 2000లకు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. నగరానికి చేరువలోని పర్వతాలపైకి ఎక్కిన కొందరు ప్రాణాలను రక్షించుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలను ప్రారంభించాయి. ఇప్పటికే వందల సంఖ్యలో మృతదేహాలను ఆసుపత్రులకు తరలించాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
వజ్రాలు దొరికాయ్!
-
వజ్రాలు దొరికాయ్!
ఫ్రీటౌన్: అకస్మాత్తుగా అదృష్టం కలిసిరావడమంటే ఇదే... సియెర్రా లియోన్‌లోని మైన్స్‌లో పనిచేసే ఓ పాస్టర్కు 706 క్యారెట్ల భారీ వజ్రం దొరికింది. ఇప్పటిదాకా దొరికిన అతిపెద్ద వజ్రాల్లో ఇది పదో వజ్రమని చెబుతున్నారు. ఇక్కడి కొనొ ప్రాంతంలో వజ్రాల కోసం వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చినవారిలో పాస్టర్ ఇమ్మాన్యుయేల్ మొమో ఒకరు. తనకు దొరికిన వజ్రాన్ని ప్రభుత్వానికి పన్ను చెల్లించిన తర్వాత అధికారికంగా విక్రయిస్తానని మొమో తెలిపారు. నాలుగు శాతం సొమ్మును తీసుకొని ప్రభుత్వమే అధికారికంగా దీనికి విలువ కూడా కడుతుందని, ఆ తర్వాత వజ్రాన్ని విక్రయించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులను ఇస్తుందని, అప్పుడే అమ్మకానికి పెడతానని మొమో చెబుతున్నాడు. 14 ఏళ్ల కుర్రాడికి కూడా.. ఇదిలాఉండగా అర్కాన్సాస్‌కు చెందిన ఓ బాలుడికి కూడా 7.44 క్యారెట్ల అరుదైన వజ్రం దొరికింది. ఇక్కడి స్టేట్ పార్క్ వజ్రాలకు ఫేమస్. దీంతో పార్క్‌లో వజ్రాల కోసం వెతికేందుకు వచ్చిన ప్రతిఒక్కరి దగ్గర 10 డాలర్ల సొమ్మును రుసుముగా వసూలు చేస్తారు. వజ్రాలు దొరుకుతాయనే ఆశతో కాకపోయినా సరదాగా విహరించేందుకు కూడా ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. అలా వచ్చినవారిలో 14 ఏళ్ల క్యాలెల్ లాంగ్‌ఫోర్డ్‌ను ఈసారి అదృష్టం వరించింది. గోధుమ రంగులో కనిపించిన ఓ రాయిని చేతిలోకి తీసుకున్న లాంగ్‌ఫోర్డ్.. సాధారణ రాయి కాదని గుర్తించి, తండ్రికి చెప్పడంతో చివరకు అది ఓ అరుదైన వజ్రమని తేలింది. అయితే ఇప్పటిదాకా ఈ పార్కులో దొరికిన 75000 వజ్రాల్లో ఇది ఏడో అతిపెద్ద వజ్రమని చెబుతున్నారు. అరుదైనది కావడంతో దీని విలువ సాధారణ వజ్రాల కంటే ఎక్కువే ఉంటుందని అంచనావేస్తున్నారు. -
అవును, నేను వేశ్యనే..
రోజుకు ముగ్గురు కస్టమర్లు వస్తారు.. అమినత తలదించుకుని చెప్పింది. ఆమె వయసు 15. ఈ వయసులో వేశ్యగా మారిందంటే కారణం.. ఆకలి. అవును.. చదువుకోవాలనే ఆకలి.. చదువుకుని జీవితంలో ఎదగాలనే ఆకలి.సియెరా లియోన్.. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటి. అనేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న దేశం. నిరుపేద కుటుంబాల పిల్లలు చదువుకోవడమంటే అదిక్కడ లగ్జరీ కిందే లెక్క. అదీ ఆడపిల్లలంటే మరింత చిన్నచూపు. ఏడాది చదువుకు రూ.4 వేలు. దీంతో ఇక్కడ ఇలాంటి అమినతలు ఎందరో కనిపిస్తారు. చదువుకు ప్రతిగా తమ దేహాన్ని అమ్ముకుంటూ.. ఏదో ఒకరోజు తమ బతుకులు బాగుపడతాయన్న ఆశతో జీవించేస్తూ.. అమినత లాంటిదే మేరీ కూడా. మేరీ క్లాస్‌లో టాపర్. చదువంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్లు చదివించలేమన్నారు. ఓ వ్యక్తి తనతో గడిపితే చదువుకయ్యే డబ్బులిస్తానన్నాడు. తన ముందు మరో మార్గం లేదు. కొన్నాళ్లు బాగానే నడిచింది. మేరీ గర్భవతి అయ్యాక అతడి అసలు రంగు బయటపడింది. వదిలి వెళ్లిపోయాడు. చదువు ఆగిపోయింది. లాయర్ కావాలన్న ఆమె కల కలగానే మిగిలిపోయింది.సియెరా లియోన్‌లో నిరుపేద బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ‘మెయిల్ ఆన్లైన్’ (బ్రిటన్‌లోని డెయిలీ మెయిల్ టాబ్లాయిడ్ తాలూకు ఆన్లైన్ వెబ్సైట్) చేపట్టిన స్ట్రీట్ చిల్డ్రన్ కార్యక్రమంలో పలువురిని కదిలించినప్పుడు ఇలాంటి గాథలెన్నో వినిపించాయి. ఇంట్లో వాళ్లు చదివించక.. కుటుంబం మద్దతు కోల్పోయి.. ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రిళ్లు వేశ్యగా.. ఉదయం విద్యార్థినిగా మారుతున్న ఎన్నో ఉదంతాలు వారిని కదిలించాయి. కొందరు వేశ్యలుగా మారుతుంటే, మరికొందరు.. చదివిస్తామంటూ కొందరు మగాళ్లు చెబుతున్న మోసపూరిత మాటలను నమ్మి.. వారి కామదాహానికి బలైపోతున్నారు. వీరి విషయంలో కొన్నాళ్లు బాగానే నడుస్తున్నా.. గర్భవతులయ్యేసరికి పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. గర్భం దాల్చడంతో వీరి చదువుకు ఫుల్స్టాప్ పడిపోతోంది. ఇంకో విషయం.. అమినత ఇప్పుడు గర్భవతి. దీని వల్ల ఆమె స్కూల్‌కు కూడా వెళ్లడం లేదు. అయితే, త్వరలోనే స్కూలుకు తప్పకుండా వెళ్తానని అమినత చెబుతోంది. ఎందుకంటే అమినత మరో మేరీ కాదు. అమినత చావనైనా చస్తుంది.. కానీ చదువుతుంది.. -
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా మహమ్మారి..
‘ఎబోలా’.. ఇప్పుడు పశ్చిమ ఆఫ్రికాలో విజృంభిస్తూ, ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి! దీని ముప్పును గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభావిత దేశాలకు సహాయసహకారాలు అందజేయాలంటూ ప్రపంచ దేశాలకు సూచించింది... ప్రస్తుతం ఎబోలా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజా వ్యాధి వ్యాప్తికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో తొలి కేసును గుర్తించారు. ఆ తర్వాత పొరుగున ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్, నైజీరియా తదితర దేశాల్లో కేసులు నమోదయ్యాయి. 2009 మార్చిలో మెక్సికోలో కనిపించిన స్వైన్ ఫ్లూ.. తర్వాత యావత్ ప్రపంచానికి వ్యాపించింది. 2003లో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్).. తొలుత ఆసియాలో కలకలం సృష్టించి, తర్వాత ప్రపంచం మొత్తానికి విస్తరించింది. ఈ రెండు సంఘటనల్లో కొన్ని వందల మరణాలు సంభవించాయి. ప్రస్తుత ఎబోలా వ్యాధితో చాలా ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమాఫ్రికా దేశాలకే పరిమితమైనప్పటికీ, మున్ముందు మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎబోలా 1,779 మందికి సంక్రమించగా, దాదాపు వెయ్యి మంది మరణించారు. వ్యాధి తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. వైరస్‌కు ఆశ్రయమిచ్చే గబ్బిలాలు: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఎబోలా వైరస్ వ్యాధి (ఉఛౌ్చ గజీటఠట ఈజీట్ఛ్చట్ఛఉగఈ) లేదా ఎబోలా హెమరేజిక్ ఫీవర్ (ఉఏఊ) బారినపడిన వారిలో 80 శాతం మంది మరణిస్తారు. ప్రధానంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వర్షాధార అడవులకు దగ్గరున్న సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఎబోలా వ్యాధి వ్యాపిస్తుంటుంది. వన్య ప్రాణుల నుంచి మనిషికి సోకి, ఆ తర్వాత మనుషుల మధ్య వ్యాధి విజృంభిస్తుంది. ఫ్రూట్‌బ్యాట్స్ అనే గబ్బిలాలు ఎబోలా వైరస్‌కు ఆశ్రయం ఇస్తాయి. మొదటిసారిగా 1976లో బెల్జియం పరిశోధకుడు పీటర్ పయట్ ఎబోలాను గుర్తించారు. ఒకేసారి ఆఫ్రికాలోని సూడాన్‌లో గల జారా ప్రాంతంతో పాటు కాంగోలోని ఎబోలా నది ఒడ్డున యంబుకు ప్రాంతంలో వ్యాధి మొదటిసారిగా అలజడి సృష్టించింది. అప్పట్నుంచి ఎబోలా వ్యాధిగా పిలుస్తున్నారు. ఎబోలా వైరస్.. ఫైలో విరిడే కుటుంబానికి చెందింది. కాబట్టి దీన్ని ఫైలో వైరస్ అని కూడా అంటారు. ఎబోలా వైరస్ ప్రజాతిలో ఐదు భిన్న జాతులుంటాయి. అవి.. బుండిబుగ్యో ఎబోలా వైరస్ (బీడీబీవీ); జైర్ ఎబోలా వైరస్ (ఈబీఓవీ); రెస్టాన్ ఎబోలా వైరస్ (ఆర్‌ఈఎస్టీవీ); సూడాన్ ఎబోలా వైరస్(ఎస్‌యూడీవీ); టాయి ఫారెస్ట్ ఎబోలా వైరస్ (టీఏఎఫ్వీ). వీటిలో బీడీబీవీ, ఈబీఓవీ, ఎస్‌యూడీవీ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందాయి. ఫిలిప్పీన్స్, చైనాలో గుర్తించిన ఆర్‌ఈఎస్టీవీ రకం మనుషులకు సోకినా, పెద్దగా ప్రభావం చూపించదు. వ్యాప్తి.. విజృంభణ: ఎబోలా వ్యాధి బారిన పడిన జంతువుల రక్తం, ఇతర శరీర స్రావాల నుంచి వైరస్ మనిషికి వ్యాపిస్తుంది. ఆఫ్రికా అడవుల్లో చింపాంజీలు, గొరిల్లాలు, కోతులు, అడవి దుప్పిలు వ్యాధికి గురై మరణించినప్పుడు, వాటిని తొలగించే క్రమంలో ఎబోలా మనిషికి సోకినట్లు గుర్తించారు. ఈ వైరస్ ఒకసారి మనిషిలోకి చేరితే వెంటనే ఇతరులకు తేలిగ్గా వ్యాపిస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాపించదు. వ్యాధి బారినపడిన రోగి శరీర ద్రవాలు ముఖ్యంగా లాలాజలం, రక్తం, చెమట, వాంతులు, వీర్యం తదితరాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. సరైన రక్షణ లేకపోతే ఎబోలా రోగులకు చికిత్స అందించే సిబ్బందికి కూడా ఇది వ్యాపిస్తుంది. మృతదేహాల ఖననం సందర్భంలోనూ బంధువులకు వ్యాపించే ప్రమాదముంది. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ఏడు వారాల వరకు వీర్యంలో వైరస్ కనిపిస్తుంది. మృత్యు ఒడికి.. వైరస్ సోకిన తర్వాత రక్తపీడనం పడిపోవడం, అవయవాల పనితీరు దెబ్బతినటం వల్ల రోగి మరణిస్తాడు. ఈ వ్యాధి పొదిగే కాలం (శరీరంలోకి వ్యాధి కారకం ప్రవేశించిన దగ్గర నుంచి లక్షణాలు బయటపడేందుకు పట్టే సమయం) వారం రోజులు. తొలుత కనిపించే లక్షణాలు.. జ్వరం, శరీరంపై దద్దుర్లు, తలనొప్పి, వికారం, వాంతులు, కడుపునొప్పి. వీటితో పాటు వెన్నునొప్పి, కీళ్లవాపు, నీళ్ల విరేచనాలు, గొంతు తడి ఆరిపోవడం వంటివి కనిపిస్తాయి. శరీరంలో వ్యాధి విజృంభిస్తే నోరు, చెవులు, ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుంది. జననాంగాల్లో వాపు, కళ్ల కలకలు, నోరు పైభాగం ఎర్రగా కందడం, శరీరమంతా దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. శరీరం లోపల, బయట తీవ్ర రక్తస్రావం సంభవిస్తుంది. తెల్ల రక్తకణాలు, రక్త ఫలకికల సంఖ్య క్షీణతతో పాటు కాలేయంలో ఎంజైముల స్థాయి పెరుగుతుంది. సత్వర చికిత్స అందిస్తేనే వ్యక్తి బతుకుతాడు. లేకుంటే 90 శాతం మృతి చెందే అవకాశముంటుంది. టీకా అందుబాటులో లేదు: ప్రారంభ లక్షణాలు కనిపించిన వారిలో మలేరియా, టైఫాయిడ్, కలరా, ప్లేగు, హెపటైటిస్, డెంగీ జ్వరాలు లేవని నిర్ధారించిన తర్వాత ఎబోలా పరీక్ష నిర్వహించాలి. ఎలీసా, యాంటిజెన్ డిటెక్షన్ టెస్ట్, కణ వర్ధనం తదితర పద్ధతుల్లో వ్యాధిని నిర్ధారించాలి. రోగి నుంచి సేకరించిన రక్త నమూనాలు చాలా ప్రమాదకరమైనవి. శరీరంలోని వైరస్‌ను నిర్మూలించేందుకు ప్రత్యేక నిరోధక మందులేవీ లేవు. అందువల్ల లక్షణాలకు చికిత్స (డఝఞ్టౌఝ్చ్టజీఛి ఖీట్ఛ్చ్టఝ్ఛ్ట) అందించాలి. ఎబోలా వ్యాధి నివారణకు టీకా అందుబాటులో లేదు. ఈ తరుణంలో ఎబోలా వ్యాప్తిని నిరోధించే మార్గాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. వ్యాధి ప్రభావిత దేశాల్లో దాదాపు 45 వేల మంది భారతీయులున్నట్లు అంచనా. ఒక్క లైబీరియాలోనే వెయ్యి మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరందరూ ఇప్పుడు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశముంది. అందువల్ల భారత్ అప్రమత్తంగా ఉండటం అవసరం. వ్యాధి ప్రభావిత దేశాల నుంచి వచ్చినవారిని, అనుమానిత లక్షణాలు ప్రదర్శించే వారిని విమానాశ్రయాల వద్ద క్వారంటైన్లను ఏర్పాటు చేసి, పరీక్షించాలి. ఇప్పటికే భారత్ ఈ దిశగా చర్యలు తీసుకుంది. డబ్ల్యూహెచ్‌వోతోపాటు ఐరోపా యూనియన్, అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తదితర సంస్థలు ఎబోలా వ్యాప్తిపై దృష్టి సారించాయి. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు: కేవలం ఆఫ్రికాలోనే కాకుండా చైనా, ఫిలిప్పీన్స్‌లోనూ ఎబోలా వైరస్ ఇతర జాతులు వ్యాప్తిలో ఉన్నాయి. అందువల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలు విడుదల చేస్తోంది. ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల ప్రజలు అడవి జంతువుల మాంసాన్ని (బుష్ మీట్) బాగా ఇష్టపడతారు. చింపాంజీ, గబ్బిలాలు తదితరాల మాంసాన్ని తింటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి జంతువులను తాకినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, జంతువుల మాంసాన్ని పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఎబోలా వైరస్ వ్యాధి ప్రారంభ లక్షణాలు సాధారణంగా ఉంటాయి. అందువల్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు, పారామెడికల్ సిబ్బంది పూర్తిస్థాయిలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, చేతులకు పొడవాటి గ్లోవ్స్, ముఖానికి మాస్క్ ధరించాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ప్రస్తుతం ఎబోలా వైరస్ వ్యాధి విస్తరిస్తున్న తీరునుబట్టి పరిస్థితి విషమంగా ఉందని, ఇది అదుపుతప్పి ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎబోలా ప్రభావిత దేశాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేనందున ప్రపంచ దేశాలు సహాయం అందించాలని సంస్థ డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ కోరారు. ఇప్పటి వరకు భారత్‌లో ఎక్కడా ఎబోలా కేసును గుర్తించలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే గినియా నుంచి చెన్నైకు వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా సోకినట్లు అనుమానం ఉండటంతో ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకలేదని లేదని తేలింది. అయినా ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయాల్లో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాలి. ప్రత్యేక నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఏమాత్రం ఉపేక్షించినా అపార ప్రాణనష్టం జరిగే ప్రమాదముంది. -
ఆఫ్రికాపై ‘ఎబోలా’ కోరలు..
వైరస్‌తో మూడు దేశాల్లో 932 మంది మృత్యువాత వైరస్ ప్రభావిత దేశాల నుంచివచ్చేవారికి వైద్య పరీక్షలు నాలుగు వారాలపాటుపర్యవేక్షణకూ భారత్ నిర్ణయం న్యూఢిల్లీ: పశ్చిమాఫ్రికాలోని సియెర్రా లియోన్, లైబీరియా, గినియా, నైజీరియా దేశాల్లో భయానకంగా పరిణమించిన ఎబోలా వైరస్ బారినపడి గత మూడురోజుల్లోనే 932 మంది మత్యువాతపడటంతో ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల వద్ద క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని భారత్ నిర్ణయిం చింది. ఎబోలా ప్రభావిత దేశాల్లో ఇప్పటిదాకా 1,711 మంది వైరస్ బారిన పడిన నేపథ్యంలో అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం నైజీరియాలో 40 వేల మంది, మిగతా దేశాల్లో మరో 5 వేల మంది భారతీయులు ఉన్నారని, పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చితే వారు వెనక్కి వచ్చే అవకాశముందని ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ బుధవారం పార్లమెంటుకు తెలిపారు. వైరస్‌బారిన పడిన రిపబ్లిక్ ఆఫ్ గినియా, లైబీరియా, సియెర్రా లియోన్‌లకు ఔషధాల కొనుగోలుకు రూ.30 లక్షల చొప్పున సాయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆమోదించారని హర్షవర్ధన్ చెప్పారు. భారత్‌కు ఈ వైరస్ ముప్పు తక్కువగానే ఉన్నా.. అన్నిరకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నాలుగు వారాల పాటు పర్యవేక్షించనున్నట్లు కూడా తెలిపారు. వైరస్ ప్రబలిన దేశాలలో వైరస్‌ను అరికట్టేందుకు ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు రూ.1,500 కోట్ల తక్షణ సాయం ప్రకటించాయి. ప్రాణాంతకమైన ఈ వైరస్‌కు సరైన చికిత్స సైతం లేకపోవడంతో భారత్ సహా అనేక దేశాల్లో ఇప్పుడు గగ్గోలు పుడుతోంది. నివారణ.. కుటుంబసభ్యులు, వైద్యులు, అంత్యక్రియలు చేసేవారికే సంక్రమించే ప్రమాదం ఎక్కువ. గ్లౌవ్స్, ముక్కు, నోరుకు ముసుగు, కళ్లద్దాలు, ఒంటినిండా వస్త్రాలను ధరిస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. చికిత్స.. ఇప్పటిదాకా ప్రామాణిక చికిత్స లేదు. రోగిని ఒంటరిగా ఉంచడం, ద్రవాలు, ఆక్సిజన్ ఎక్కించడం, ఇతర ఇన్ఫెక్షన్లకు చికిత్సతోప్రాణాలు కాపాడే అవకాశం కొద్దిగా ఉంటుంది. అయితే లైబీరియాలో ఎబోలా బాధితులకు చికిత్స చేస్తున్న ఇద్దరు అమెరికా వైద్యులకు వైరస్ సోకిందని, వారికి ‘జడ్ మాప్’ అనే రహస్య ఔషధాన్ని ఇవ్వగా ప్రాణాపాయం తప్పిందని చెబుతున్నారు. కానీ ఈ ఔషధం గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ► ప్రాణాంతకం.. ఎబోలా వైరస్ ► మనిషికి అత్యంత ప్రమాదకరమైన వైరస్లలో ఒకటి ► మొదటిసారిగా కాంగోలోని ఎబోలా నది సమీపంలో 1976లో కనిపించింది. ► అందుకే దీనికి ఎబోలా అని పేరుపెట్టారు. ► వీటిలో ఐదు రకాలు ఉండగా మూడు చాలా ప్రమాదకరమైనవి ► 100 మందికి సోకితే దాదాపు 90 మంది చనిపోతారు ► 1979 నుంచి ఇప్పటిదాకా 2,200 మందికి సంక్రమించగా.. 1,500 మంది చనిపోయారు ► గబ్బిలాల ద్వారా ఇది జంతువులకు, జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. మనుషులపై ప్రభావం ఇలా... సంక్రమణ: రోగి రక్తం, మలమూత్రాలు, చెమట, ఇతర శరీర ద్రవాలు అంటిన సూదులు, కలుషిత మాంసంతో సంక్రమిస్తుంది. మొదటిదశలో: జ్వరం, తలనొప్పి, కీళ్లు, గొంతు నొప్పి, బలహీనత, తీవ్ర అలసట వస్తాయి. రెండోదశలో: వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు. మూడోదశలో: వైరస్ దాడివల్ల కాలేయం, మూత్రపిండాలు విఫలమవుతాయి. శరీరంపై మచ్చలు, బొబ్బలు ఏర్పడతాయి. శరీరంలో అంతర్గత, బహిర్గత రక్తస్రావం మొదలై చివరికి రోగి చనిపోతాడు. ఈ మూడుదశలూ 2-21 రోజుల వ్యవధిలో జరిగిపోతాయి. 50-90% మంది 10 రోజుల్లోనే చనిపోతారు. ► ఎబోలా వైరస్ సహజ అతిథేయులు గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్) ► 1979 నుంచి మనుషులకు వైరస్ వ్యాపించిన ప్రాంతాలు ► జంతువుల్లో వైరస్ క నిపించిన ప్రాంతాలు ► ప్రస్తుతం వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న దేశాలు గినియా, లైబీరియా, సియెర్రా లియోన్ -
అగ్రరాజ్యాలను వణికిస్తున్న ఇబోలా!!
మొన్నా మధ్య సార్స్.. ఆ తర్వాత హెచ్1ఎన్1.. ఇప్పుడు ఇబోలా! అగ్రరాజ్యాలకు వైరస్ భయాలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. తాజాగా ఇబోలా వైరస్‌ను చూసి అమెరికా సహా అగ్రరాజ్యాలన్నీ గజగజలాడుతున్నాయి. ప్రస్తుతం సియెర్రా లియోన్, లైబీరియా ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న ఈ వైరస్ నియంత్రణకు వందలాది మంది దళాలను మోహరించారు. ఇప్పటికే 887 మంది ఈ వైరస్ బారిన పడి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. పశ్చిమాఫ్రికా దేశాల్లో వైద్యవర్గాలు దీనిపై ఇప్పటికే చేతులెత్తేశాయి. సియెర్రా లియోన్, లైబీరియా, గినియా దేశాల్లో ఇబోలా వైరస్‌ను అదుపు చేసేందుకు 1218 కోట్ల రూపాయల సాయాన్ని ప్రపంచబ్యాంకు ప్రకటించింది. ఈ వైరస్‌ను వీలైనంత త్వరగా నియంత్రించకపోతే అత్యంత దారుణమైన పరిణామాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్ఓ) గత వారం హెచ్చరించింది. గడిచిన రెండు వారాల్లోనే ఈ వైరస్ బారిన పడి 61 మంది మరణించారు. ముందుగా గినియాలోని అడవుల్లో గత ఫిబ్రవరిలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైంది. అప్పటినుంచి అక్కడ మరణాల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఆ తర్వాత పొరుగున ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్‌లకు ఈ వైరస్ పాకింది. నైజీరియాలో పాట్రిక్ సాయెర్ అనే అమెరికా పౌరుడు లైబీరియా నుంచి వచ్చిన తర్వాత జూలై నెలాఖరులో మరణించాడు. అతడికి చికిత్స చేసిన వైద్యుడికి కూడా వైరస్ సోకింది!! దీంతో అసలు ఈ వైరస్ సోకిన బాధితులకు వైద్యం చేయడానికే ఆరోగ్యబృందాలు భయపడిపోయాయి. పలు దేశాల్లో ఈ వైరస్‌కు భయపడి అసలు పాఠశాలలు తెరవడం మానేశారు. సాధారణ వైద్యులు వైద్యం చేసేది లేదని చెప్పడంతో భారీ సంఖ్యలో మిలటరీ వైద్యులను, వైద్య బృందాలను సియెర్రా లియోన్ తదితర ప్రాంతాలకు పంపారు. అక్కడే ఈ కేసుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు పాకడానికి ముందే దీన్ని అరికట్టాలని ప్రయత్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాలను క్వారంటైన్ చేసనట్టు ప్రకటించి, అక్కడినుంచి ఎవరినీ ఇతర ప్రాంతాలకు అనుమతించకుండా పక్డ్బందీగా చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. లైబీరియా లాంటి దేశాల్లో దాదాపు అత్యవసర పరిస్థితి ప్రకటించినట్లు అయ్యింది. పరిస్థితి మెరుగయ్యేలోపే మరింత దారుణంగా తయారవుతోందని లైబీరియా సమాచార శాఖ మంత్రి లూయిస్ బ్రౌన్ వాపోయారు. సమస్య పరిష్కారం ఎలా? పెద్దపెద్ద ఫార్మా దిగ్గజాలన్నీ ఈ వైరస్‌ను అదుపు చేయలేక మల్లగుల్లాలు పడుతుంటే, అమెరికాలో చిన్న ఔషధ సంస్థ మాత్రం ఓ సీరమ్‌ను తయారుచేసింది. ప్రస్తుతానికి ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్న దీన్ని ఇద్దరు అమెరికన్లపై ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగాలను అత్యంత రహస్యంగా చేస్తున్నారు. ఇది కొంత వరకు పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం కొంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ, పేద దేశాలకు ఇది ఎంతవరకు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం ఇంకా చూడాల్సి ఉంది.