సియర్రా లియోన్ పేదరికంతో కొట్టుమిట్టాడే ఓ ఆఫ్రికన్ దేశం. దీని రాజధాని ఫ్రీటౌన్. దేశ ఆర్థిక ప్రగతి మొత్తం రాజధానిలోనే కేంద్రీకృతం కావడంతో దాదాపు 12 లక్షల మంది జనాభాతో ఫ్రీటౌన్ కిక్కిరిసి ఉంటుంది. అలాంటి నగరంపై ప్రకృతి తన ప్రకోపాన్ని చూపింది. చిక్కిపోయిన దేహాలతో ఉండే సగటు ఫ్రీటౌన్ వాసి ప్రాణాలను అరచేత పట్టుకుని, ఇళ్లను వదిలి కొండలను ఎక్కాల్సిన పరిస్థితిని కల్పించింది.