Philippines Presidential Elections: ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!

మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ జూనియర్ (64) ఘన విజయం సాధించినట్లు అనధికార ఓట్ల లెక్కింపు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1986లో తండ్రి , ఫిలిప్పీన్స్ నియంత ఫెర్డినాండ్ మార్కోస్‌ను గద్దె దింపిన ఆ ప్రజలే మళ్లీ తనయుడికి పట్టం కట్టడం విశేషం.
మంగళవారం మధ్యాహ్నం నాటికి 97 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని మూడు కోట్లకుపైగా ఓట్లు మార్కోస్‌కే పడినట్లు అనధికార గణాంకాల్లో వెల్లడైంది. కొత్త అధ్యక్షుడు జూన్ 30న బాధ్యతలు చేపడతాడు. పేదరికం, మాదకద్రవ్యాలు, సమాజంలో అసమానతలు ఫిలిప్పీన్స్‌ను పట్టిపీడిస్తున్నాయి. మార్కోస్ గెలుపు వార్త తెల్సి మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తంచేసింది.