53 ఏళ్లకు దొరికిన పర్స్‌, ఏదీ మిస్‌ అవ్వలేదు!

lost Wallet found after 53 years in California - Sakshi

ఉబ్బితబ్బిబయిన వాతావరణ శాస్త్రవేత్త

కాలిఫోర్నియా: దశాబ్దాల కిందట పోయిన పర్స్‌ ఇప్పుడు లభించింది. దీంతో పోగొట్టుకున్న ఆ వ్యక్తి ఉబ్బితబ్బిబయ్యాడు. పర్స్‌లో ఉన్న వస్తువులన్నీ అలాగే ఉండడంతో పరమానందం పొందాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగింది. 1967లో పోగొట్టుకున్న పర్స్‌ 2021లో లభించడం ఆశ్చర్యమే. దీనికి సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు చెందిన 91 ఏళ్ల పాల్ గ్రిశామ్‌ నౌక వాతావరణ శాస్త్రవేత్త. అమెరికా నౌక వాతావరణ శాస్త్రవేత్త పౌల్‌ గ్రిషమ్‌ రాస్‌ ద్వీపంలో 1967 ప్రాంతంలో ఏడాది పాటు వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేశారు. 13 నెలలు అక్కడ పనిచేసిన అనంతరం తిరిగి కాలిఫోర్నియాకు చేరుకోగానే ఆయన తన వాలెట్‌ ఎక్కడో మిస్‌ అయిందని గ్రహించాడు.

అందులో నేవి ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన ఐడీలు ఉన్నాయట. అలా మిస్‌ అయిన పర్స్‌ 52 ఏళ్ల తర్వాత తాజాగా దొరికింది. భూమి మీద దక్షిణ దిశలో చిట్టచివరి పట్టణంగా పేర్కొనే అంటార్కిటికా ఖండంలోని మెక్‌ముర్డో స్టేషన్‌లో ఇటీవల ఓ భవనాన్ని కూల్చివేశారు. కూల్చివేతల సమయంలో పనులు చేస్తున్న వారికి రెండు పర్సులు కనిపించాయి. వాటిని పరిశీలించగా అందులో ఒకటి గ్రిశామ్‌కు చెందిన పర్స్‌ కూడా ఉంది. అయితే ఆయన పోగొట్టుకున్న సమయంలో పర్స్‌లో ఉన్న నావీ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం అలాగే ఉన్నాయి. ఇక కూల్చివేతల్లో దొరికిన మరో పర్స్‌ పౌల్ హావర్డ్ అనే వ్యక్తిదని గుర్తించారు. 2016లో పౌల్‌ హావర్డ్‌ మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top