బురదచరియలు విరిగిపడి క్షణాల్లో నేలమట్టం; వీడియో వైరల్‌

At Least 20 People Missing Mud Slides Sweeps Away Houses In Japan Viral - Sakshi

టోక్యో: జపాన్‌ రాజధాని టోక్యో సమీపంలోని ఓ పట్టణంలో భారీ వర్షాల కారణంగా శనివారం ఒక్కసారిగా బురద, చెత్తాచెదారంతో కూడిన వరద ఇళ్లపైకి దూసుకురావడంతో కనీసం 19 మంది గల్లంతయ్యారు. షిజుఓకా ప్రిఫెక్చర్‌లోని రిసార్ట్‌ ప్రాంతమైన అటామీలో సుమారు 80 ఇళ్లు పూర్తిగా బురద చరియల్లో సమాధి అయినట్లు అధికారులు తెలిపారు.


ఓ వంతెన కూడా కొట్టుకుపోయిం దన్నారు. సుమారు 100 మంది గల్లంతై ఉంటారని ఓ అధికారి తెలిపారు. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందన్నారు. బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. షిజుఓకా ప్రిఫెక్చర్‌లో 19 మంది వరకు జాడ తెలియకుండా పోయినట్లు అధికార ప్రతినిధి చెప్పారు. అయితే, ఈ సంఖ్య పెరగవచ్చని ఆయన అన్నారు. వారం రోజులుగా జపాన్‌లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top