అది నిగూఢ రహస్యాన్ని దాచుకున్న సరస్సు.. రాత్రి కాగానే..

this lake turns blue at night - Sakshi

ప్రపంచంలో అంతుచిక్కని వింతలెన్నో ఉన్నాయి. వీటి రహస్యాల ముడి విప్పాలని శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం లేకపోతోంది. అలాంటి అత్యంత వింత సరస్సు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వింతలు, విశేషాలు అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ కోవలోకి వచ్చే ఒక వింత సరస్సు అటు పరిశోధకులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ సరస్సులోని నీటి రహస్యం గురించి తెలుసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. రాత్రయ్యే సరికి ఆ సరస్సులోని నీరు నీలి రంగులోకి ఎందుకు మారిపోతున్నదో ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్కలేదు. ఈ నేపధ్యంలో పలువురు శాస్త్రవేత్తలు తమ వాదనలు వినిపించినా, అవి ఇప్పటివరకూ పూర్తిస్థాయి సమాధానాన్ని ఇవ్వలేదు. 

అదరగొట్టే ఉష్ణోగ్రత..
ఈ సరస్సు ఇండోనేషియాలో ఉంది. దీనిని కవాహ్‌ ఇజేన్‌ లేక్‌ అని అంటారు. ఇది చూసేందుకు ఇతర సరస్సుల మాదిరిగానే కనిపిస్తుంది. ఈ సరస్సులోని నీరు ఎంతో ఉప్పగా ఉంటుందని చెబుతారు. ఈ నీరు 200 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత కలిగివుండటం విశేషం. ఉదయం వేళలో ఈ సరస్సులోని నీరు సాధారణంగానే కనిపిస్తుంది. మధ్యరాత్రి సమయానికి గాఢమైన నీలిరంగులోకి మారిపోతుంది. అలాగే మెరుస్తూ కనిపిస్తుంటుంది.  ఇది ఎంతో ఆకర్షించే విషయమైనప్పటికీ, టూరిస్టులు ఇక్కడికి రాకపోవడం విశేషం. సరస్సులోని వేడి నీటి కారణంగా ఇక్కడికి వచ్చేవారెవరూ ఎక్కువసేపు ఇక్కడ ఉండలేరు.  శాస్త్రవేత్తలు  కూడా ఈ కారణంగానే తమ పరిశోధనలు ముందుకు సాగడం లేదని చెబుతుంటారు. 

ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితుల వింత ప్రవర్తన

రసాయన వాయువులే కారణమా?
పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరస్సుపై లెక్కలేనన్ని పరిశోధనలు సాగించారు. అయితే ఇప్పటి వరకూ ఈ నీటి వెనుకనున్న రహస్యాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు. ఈ సరస్సుకు సమీపంలో పలు అగ్నిపర్వతాలు ఉన్నాయని, అవి అప్పుడప్పుడు పేలు తుంటాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అగ్నిపర్వతాలు పేలడం వలన హైడ్రోజన్‌ ఫ్లోరైడ్‌, సల్ఫ్యూరిక్‌ డయాక్సైడ్‌ తదితర వాయువులు వెలువడతాయి. ఈ వాయువుల రియాక్షన్‌ కారణంగానే సరస్సులోని నీటి రంగు మారుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ విధంగా నిరంతరం వాయువులు వెలువడినప్పుడు ఉదయం వేళలో నీటి రంగు మారకుండా, రాత్రివేళలో మాత్రమే నీటి రంగు ఎందుకు మారుతున్నదనే ప్రశ్న అలానే మిగిలిపోయింది. మరి దీనికి సమాధానం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. 

ఇది కూడా చదవండి: ‘తాజ్‌’ యమ క్రేజ్.. ఆదాయంలో టాప్‌ వన్‌!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top