
దుబాయ్: కువైట్ పాలకుడు అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబాహ్(86)శనివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఒక మంత్రి వెల్లడించారు. ఆయన మరణానికి గల కారణాలను మాత్రం పేర్కొనలేదు.
ఉప పాలకుడిగా వ్యవహరిస్తున్న ఆయన సవతి సోదరుడు షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబేర్(83)తదుపరి పాలనా పగ్గాలు చేపడతారని తెలుస్తోంది. జబేర్‌కు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన యువరాజుగా పేరుంది. నవంబర్‌లో షేక్ నవాఫ్ గుర్తు తెలియని కారణాలతో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎటువంటి వార్తలు బయటకు రాలేదు.